అన్వేషించండి

AP Constable Exam: కానిస్టేబుల్ పరీక్షకు 91 శాతం అభ్యర్థులు హాజరు, రెండు వారాల్లో ఫలితాలు!

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,58,219 మంది మాత్రమే పరీక్షకు హాజరు.

ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జనవరి 22న నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. 

ఆన్సర్ కీ ఎప్పుడంటే?
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జనవరి 22న రాత్రి 8 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు పోలీసు నియామక మండలి ఒకప్రకటనలో తెలిపింది. ఆన్సర్ కీపై జనవరి 25న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలిపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానంలోనూ పంపే అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలను, అభ్యర్థులు OMR పత్రాలను రెండువారాల్లోగా అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి ప్రకటించింది. 
Mail ID: mail-slprb@ap.gov.in

AP Constable Exam: కానిస్టేబుల్ పరీక్షకు 91 శాతం అభ్యర్థులు హాజరు, రెండు వారాల్లో ఫలితాలు!

ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ!
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది. అంటే ఒక్కో పోస్టుకు 83 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషులు 1,40,453 మంది ఉండగా..మహిళలు 32,594 మంది ఉన్నారు. మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడుతున్నారు. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. 

🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:

➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు   

పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 6100

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం 100
విజయనగరం 134
విశాఖపట్నం (సిటీ) 187
విశాఖపట్నం (రూరల్) 159
తూర్పు గోదావరి 298
రాజమహేంద్రవరం (అర్బన్) 83
పశ్ఛిమ గోదావరి 204
కృష్ణా 150
విజయవాడ (సిటీ) 250
గుంటూరు (రూరల్) 300
గుంటూరు (అర్బన్) 80
ప్రకాశం 205
నెల్లూరు 160
కర్నూలు 285
వైఎస్సార్ - కడప  325
అనంతపురం 310
చిత్తూరు 240
తిరుపతి అర్బన్ 110
మొత్తం 3580

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  630
రాజమహేంద్రవరం 630
మద్దిపాడు - ప్రకాశం  630
చిత్తూరు 630
మొత్తం 2520


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
Viral Video: సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని  కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Embed widget