High Court Jobs: ఏపీ హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తుకు 2 రోజులే గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 30న ప్రారంభం కాగా.. అక్టోబరు 22తో గడువు ముగియనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
* ఏపీ హైకోర్టు ఉద్యోగాలు
➦ కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ: 76 పోస్టులు
అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. Registrar (Administration), High Court of Andhra Pradesh, on State Bank of India, High Court Branch, Nelapadu, Amaravati (IFSC -SBIN0061328) పేరిట చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తులు పంపే కవరు మీద "Application for the post of Court Mater and Personal Secretary to the Hon'ble Judges and Registrars, by direct recruitment" అని రాసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా సమర్పించాలి లేదా పంపించాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: అభ్యర్థులు నిమిషానికి 180 పదాలు (3 నిమిషాల వ్యవధి) టైప్ చేయగలగాలి. అలాగే నిమిషానికి 150 పదాలు (4 నిమిషాల వ్యవధి) టైప్ చేయగలగాలి. దీంతోపాటు కంప్యూటర్ మీద 40 నుంచి 45 నిమిషాల పాటు ట్రాన్‌స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు షార్ట్‌హ్యాండ్ పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. షార్ట్ హ్యాండ్ పరీక్షలో అర్హత సాధించినవారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
జీత భత్యాలు: రూ.57,100 నుంచి రూ.1,47,760.
ముఖ్యమైన తేదీలు..
* నోటిఫికేషన్ వెల్లడి: 28.09.2022.
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022.
* దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 22.10.2022.
* పరీక్ష తేది: 19.11.2022.
* ఇంటర్వ్యూలు ప్రారంభం: 25.11.2022.
* పరీక్ష ఫలితాల వెల్లడి: 30.11.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Registrar (Administration),
High Court of Andhra Pradesh,
Nelapadu, Amaravati,
Guntur District, Pin-522239.
:: Also Read ::
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉండాలి!
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10 నుండి ప్రారంభంకానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఆర్మీలో 128 రిలీజియస్ టీచర్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AOC: ఆర్మీలో చేరే యువతకు శుభవార్త, అగ్నివీర్ ఎంపికలు 29 నుంచే!
సైన్యంలో చేరే యువత కోసం అగ్నివీర్ ఎంపికలు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్(ఏఓసీ) కేంద్రంలోని ఏబీసీ ట్రాక్‌లో నిర్వహిస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ), క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ కేంద్రం తెలిపింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..