APHC JCJ Recruitment: ఏపీ జ్యుడీషియల్ సర్వీసులో జూనియర్ సివిల్ జడ్జ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
AP High Court Jobs: ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 39 ఖాళీలను భర్తీచేయనున్నారు.
APHC Recruitment: ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 39 ఖాళీలను భర్తీచేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తారు. లా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 15న విడుదల చేస్తారు. అనంతరం ఏప్రిల్ 13న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ, అభ్యర్థుల సమాధాన పత్రాలను ఏప్రిల్ 18న విడుదల చేస్తారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను విడుదల చేస్తారు.
వివరాలు..
* సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 39. (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్-32, ట్రాన్స్‌ఫర్-07)
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(లా) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.77,840 - రూ.1,36,520.
దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ), రాతపరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం..
➥ మొత్తం 100 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నలకు ఒకమార్కు కేటాయించారు. పరీక్ష సమయం 2 గంటలు.
➥ స్క్రీనింగ్ పరీక్షలో 40 % లేదా ఆపై మార్కులు సాధించిన అభ్యర్థుల్లో 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు (సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్) ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున, మూడు పేపర్లుకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ పేపర్‌లో 25 మార్కులకు ట్రాన్స్‌లేషన్, 75 మార్కులు ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 55 శాతం మార్కులు), బీసీలకు 55 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 50 శాతం మార్కులు), ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 50 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 45 శాతం మార్కులుగా నిర్ణయించారు.
పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
వైవా-వాయిస్: మొత్తం 50 మార్కులకు వైవా-వాయిస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరుకాని వారిని ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో వైవా-వాయిస్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ముఖ్య తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.03.2024. (11.59 PM)
➥ స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేది: 15.03.2024.
➥ స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 13.04.2024.
➥ ప్రాథమిక కీ విడుదల/ అభ్యంతరాల స్వీకరణకు చివరితేదీ: 18.04.2024.