అన్వేషించండి

AP DSC Results 2025: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఆగస్టు 15లోగా ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

AP DSC results online | డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. apdsc.apcfss.in లో ఫలితాలు యాక్సెస్ చేయవచ్చు.  

Andhra Pradesh DSC Results 2025: అమరావతి: ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పదిహేనులోగా డీఎస్సీ రిజల్ట్స్ విడుదల చేస్తే.. ఆగస్టు 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొదలుకానుంది. ప్రాసెస్ మొత్తం పూర్తయితే పోస్టులకు ఎంపికైన తుది జాబితాను విడుదల చేసి ఆగస్టు నెలాఖరుకు పోస్టింగ్ ఇవ్వాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 

16,347 మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అంతా సక్రమంగా జరిగితే ఆగస్టు 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించనున్నారు. కాగా, కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ఆగస్టు నెలాఖరు నాటికి కొత్త టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారికి పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణను పోస్టింగ్‌లకు ముందే విద్యాశాఖ పూర్తి చేస్తుంది. కానీ ఇదివరకే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా స్కూళ్లల్లో టీచర్ల కొరత ఏర్పడటంతో 4, 5 శనివారం, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారం నుంచే స్కూళ్లలో కొత్త టీచర్లు చేరనున్నారు. 

స్పోర్ట్స్ కోటా వివరాల కోసం వెయిటింగ్
ఏపీ డీఎస్సీలో క్రీడల విభాగం (Sports Quota)లో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు శాప్ నుంచి విద్యాశాఖకు ఇంకా అందలేదు. శాప్ నుంచి వివరాలు అందగానే ఆయా జిల్లాల్లో కటాఫ్ మార్కులను పాఠశాల విద్యాశాఖ ప్రకటిస్తుంది. ఆలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in లో ఫలితాలు,  తుది కీ యాక్సెస్ చేయవచ్చు.  

శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్లు (SA), ప్రిన్సిపాల్స్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET) వంటి పోస్టులను ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఏపీ డీఎస్సీ ఫలితాలను ఎలా చెక్ చేయాలి:

AP DSC అధికారిక వెబ్‌సైట్ www.apdsc.apcfss.inని సందర్శించండి.
హోమ్‌పేజీలో “AP DSC Results 2025” లింక్‌ మీద క్లిక్ చేయండి.
మీ రోల్ నంబర్ లేక రిజిస్ట్రేషన్ నంబర్, డేటాఫ్ బర్త్ వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి
“సబ్మిట్” బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై డీఎస్సీ రిజల్ట్ కనిపిస్తుంది.
DSC Result డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుంటే మంచిది

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget