అన్వేషించండి

AP DSC Application: ఏపీ డీఎస్సీ - 2024 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

DSC Application: ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25తో ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.. 

AP DSC Application: ఏపీ డీఎస్సీ-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అర్హతపై హైకోర్టు స్టే విధించిడంతోపాటు, దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా గడువును పెంచారు. మరో మూడురోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఫిబ్రవరి 25న రాత్రి 12 గంటల వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. 

ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో ఫీజు చెల్లింపు గడువు ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఫిబ్రవరి 25 వరకు ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఏపీ గురుకులాల్లో 1534 ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు - దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏపీలో 4566 టీచర్ పోస్టులు - దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

వివరాలు..

➥ ఎస్టీజీ: 2280 పోస్టులు

➥ స్కూల్ అసిస్టెంట్: 2299 పోస్టులు

➥ టీజీటీ: 1264 పోస్టులు

➥ పీజీటీ: 215 పోస్టులు

➥ ప్రిన్సిపల్: 42 పోస్టులు

ఏపీ డీఎస్సీ షెడ్యూలు ఇలా..

➥ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్: 12.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 12.02.2024.

➥ ఫీజుచెల్లింపు చివరితేది: 21.02.2024. (25.02.2024. వరకు పొడిగించారు)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024. (25.02.2024. వరకు పొడిగించారు)

➥ ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో: 24.02.2024.

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 05.03.2024 నుంచి.

➥ ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు: 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఆన్సర్ కీ వెల్లడి: 31.03.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.

➥ ఫైనల్ కీ వెల్లడి: 08.04.2024.

➥ డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి: 15.04.2024 

Website

టాప్ హెడ్ లైన్స్

TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget