AHA Exam: ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్ష తేదీ వెల్లడి, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
AHA Exam: ఏపీ పశుసంవర్ధక శాఖలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిసెంబరు 31న నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబరు 27 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
AP AHA Exam 2023 Date: ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిసెంబరు 31న నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబరు 27 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15,000 ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 నుంచి రూ.72,810 వరకూ జీతం ఉంటుంది.
ఏపీ పశుసంవర్ధక శాఖలో 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా, ఇంటర్ ఒకేషనల్ కోర్సు, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ప్రకంటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 27 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. రాతపరీక్షలో ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.
పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పార్ట్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు-50 మార్కులు-50 నిమిషాలు; పార్ట్-బి: ఏనిమల్ హస్బెండరీ సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు-100 నిమిషాలు కేటాయించారు. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
పోస్టుల వివరాలు..
* యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టులు
ఖాళీల సంఖ్య: 1896.
జిల్లాలవారీగా ఖాళీలు..
➥ అనంతపురం: 473 పోస్టులు
➥ చిత్తూరు జిల్లా: 100 పోస్టులు
➥ కర్నూలు జిల్లా: 252 పోస్టులు
➥ వైఎస్‌ఆర్ కడప: 210 పోస్టులు
➥ నెల్లూరు జిల్లా: 143 పోస్టులు
➥ ప్రకాశం జిల్లా: 177 పోస్టులు
➥ గుంటూరు జిల్లా: 229 పోస్టులు
➥ కృష్ణా జిల్లా: 120 పోస్టులు
➥ పశ్చిమ గోదావరి జిల్లా: 102 పోస్టులు
➥ తూర్పు గోదావరి జిల్లా: 15 పోస్టులు
➥ విశాఖపట్నం జిల్లా: 28 పోస్టులు
➥ విజయనగరం జిల్లా: 13 పోస్టులు
➥ శ్రీకాకుళం జిల్లా: 34 పోస్టులు
అర్హతలు..
➤ యానిమల్ హజ్బెండరీ విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ ఇంటర్ ఒకేషనల్ (డెయిర్, పౌల్ట్రీ సైన్సెస్)/ రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు / ఇంటర్ వొకేషనల్ (మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్) కోర్సు చేసి ఉండాలి. (లేదా)
➤ ఇంటర్ వొకేషనల్ (డెయిరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ ఓపెన్ ఇంటర్ (డెయిరీ పార్మింగ్ ఒక వొకేషనల్ సబ్జెక్టుతో) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ బీఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ బీఎస్సీలో డెయిరీ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (లేదా)
➤ ఎంఎస్సీ(డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా (వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా)
➤ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి డిప్లొమా (డెయిరీ ప్రాసెసింగ్) ఉండాలి. (లేదా)
➤ భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి డిప్లామా(వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా)
➤ బి.వొకేషనల్ (డెయిరింగ్ & ఏనిమల్ హస్బెండరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.