![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
APPSC: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 అనలిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్-2 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీచేయనున్నారు.
![APPSC: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 అనలిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి Andhra Pradesh Public Service Commission has released notification for the Recruitment of Analyst Grade-II post in AP Pollution Control Board APPSC: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 అనలిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/12/415ec7f36b49cb8a7b0f716304f2c5f61707758998153522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Pollution Control Board Analyst Posts: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్-2 (Analyst Grade-2) ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* అనలిస్ట్ (గ్రేడ్-2) పోస్టులు
ఖాళీల సంఖ్య: 18 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఓసీ-07, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-02, ఎస్టీ-01, బీసీ-06.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ/ బయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు; ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
READ ALSO : ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాలపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2(సంబంధిత సబ్జెక్టు): 150 ప్రశ్నలు-350 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు కేటాయించారు. రాతపరీక్షలో కటాఫ్ మార్కులను ఓసీ/స్పోర్ట్స్‌పర్సన్స్/ఎక్స్-సర్వీస్‌మెన్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 మార్కులుగా; బీసీలకు 35 మార్కులుగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
ప్రాక్టికల్ పరీక్షలు: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఫ్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30గా, బీసీలకు 35గా, ఓసీలకుు 40 మార్కులుగా నిర్ణయించారు.
జీతం: నెలకు రూ.48,440 - రూ.1,37,220.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.04.2024 (11:59 PM).
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)