అన్వేషించండి

AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాటిలో యూనివర్శిటీల వారీగా ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లను భర్తీ చేస్తున్నారో తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో 18 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలు ప్రకటించారు.
  • దరఖాస్తులు మే 18 నుంచి జూన్ 8 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి.
  • స్క్రీనింగ్‌ టెస్టు, అకడమిక్‌ స్కోరు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది.
  • https://apuniversitiesrecruitment.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

AP Universities Assistant Professor Vacancy: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా రంగంలో చారిత్రాత్మకమైన మార్పునకు నాంది పలుకుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ యూనివర్శిటీల్లోని సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించింది. మే 15, 2026న వెలువడిన ఈ నోటిఫికేషన్లు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేడర్‌లో నియామకాలు చేపట్టడం ద్వారా పరిశోధన, బోధనా రంగాల్లో నూతన శక్తిని నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

ముఖ్యమైన తేదీలు ఎప్పుడు ఏం జరుగుతోంది?

ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8వ తేదీ సాయంత్ర ఐదు గంటలు. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలను జూన్ 15 నాటికి ఆయా యూనివర్సిటీలకు చేరాలి. వాటిని అధికారులు పరిశీలించి 22వ తేదీని ప్రాథమిక అర్హుల జాబితాను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే 29వ తేదీ వరకు చెప్పుకోవచ్చు. తర్వాత 30వ తేదీన స్క్రీనింగ్ టెస్టు తుది జాబితా ప్రదర్శిస్తారు. 

విశ్వవిద్యాలయాల వారీగా ఖాళీల వివరాలు 

రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

యూనివర్శిటీ పేరు   

రెగ్యులర్ పోస్టులు 

బ్యాక్‌లాగ్ పోస్టులు

భర్తీ చేయనున్న సబ్జెక్టుల వివరాలు

ఆంధ్ర యూనివర్శిటీ    203   05   బయోకెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, లా, పొలికిటల్ సైన్స్, ఫిజిక్స్, సీఎస్‌ఈ
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం    86   02   ఆంత్రోపాలజీ, బాటనీ, కెమికల్ ఇంజినీరింగ్, తెలుగు, స్టాటిస్టిక్స్‌ 

జేఎన్‌టీయూ అనంతపురం 

75

04 

సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ 

 జెఎన్టీయూ కాకినాడ    41    03   సివిల్, మెకానికల్, సీఎస్‌ఈ, మేనేజ్‌మెంట్, ఇంగ్లీష్, మ్యాథ్స్‌, 
జేఎన్టీయూ జీవీ    30  04   సివిల్, ఎకనామిక్స్, మ్యాథ్స్, సీఎస్‌ఈ 
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం    49   18    సోషియాలజీ, లా, స్టాటిస్టిక్స్‌, బాటనీ, మేనేజ్‌మెంట్ 
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ     44   01   ఆర్కిటెక్చర్, బాటనీ, కామర్స్‌, ఎకామిక్స్‌, సివిల్‌, సీఎస్‌ఈ
రాయలసీమ విశ్వవిద్యాలయం  38   0      బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, తెలుగు, మ్యాథ్స్‌,

ఆర్జీయూకేటీ    

104   66    బయాలజీ, ఫిజిక్స్, ఇంజినీరింగ్ కోర్సులు, మేనేజ్‌మెంట్‌ 

యోగి వేమన విశ్వవిద్యాలయం   

0   19  బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, హిస్టరీ, మెకానికల్, సీఎస్‌ఈ

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాయం    

21   01   హోమ్‌సైన్స్‌, లా మైక్రోబయాలజీ, సీఎస్‌ఈ 

కృష్ణా విశ్వవిద్యాలయం 

  27    03   సీఎస్‌ఈ, ఇంగ్లీష్, మేనేజ్మెంట్, అప్లైడ్ మ్యాథ్స్‌
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం    

 

20   05 బాటనీ, సీఎస్‌ఈ, ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌
డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విశ్వవిద్యాలయం     28   01   కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, సోషల్ వర్క్,
ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ    37   03    బాటనీ, కెమిస్ట్రీ, సీఎస్‌ఈ, మేనేజ్మెంట్‌, ఎకనామిక్స్‌
డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌వర్శిటీ   46   ---   పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, సీఎస్‌ఈ, ఇంగ్లీష్‌

ద్రావిడ విశ్వవిద్యాలయం  

 

07  -  --  కెమిస్ట్రీ, కామర్స్‌, మేనేజ్మెంట్‌

ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం  

 

08   

 

---- ఏ సబ్జెక్ట్‌లో పోస్టులు భర్తీ చేస్తున్నారో నోటిఫికేషన్‌లో చెప్పలేదు. 

విద్యార్హతలు 

అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రధానంగా ఈ అర్హతలు ఉండాలి. 

ఆర్ట్స్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, లా, కామర్స్, ఎడ్యుకేషన్‌  సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు యూజీసీ నిర్వహించే నెట్‌ లేదా సీఎస్‌ఐఆర్‌ నెట్ ఉత్తీర్ణులవ్వాలి. లేదా సెట్‌, స్లెట్‌ అర్హత కలిగి ఉండాలి. యూజీసీ 2009/2016 నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి నెట్‌/సెట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్ లేదా ఎంజీ/ ఎంటెక్‌/ ఎంఎస్‌లలో ఏదో ఒకటి ఫస్ట్ క్లాస్‌ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

మేనేజ్మెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ, పీజీడీఎం, ఎంకామ్‌ లలో ఫస్ట్ క్లాస్, నెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీతోపాటు రెండేళ్ల వృత్తిపరమైన అనుభవం ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యూగులకు అర్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

మొదట ఏపీపీఎస్సీ ద్వారా సీబీటీ స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. ఇందులో అభ్యర్థులను 1:12 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత అకాడమిక్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఆధారంగా 1:4 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. 

ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ఇందులో లెక్చర్‌ డెమోన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు, పర్శనాలిటీకి 15 మార్కులు, డొమైన్ నాలెడ్జ్‌కు 35మార్కులు, రీసెర్చ్ కాంపిటెన్స్‌కు 25 మార్కులు కేటాయిస్తారు. 

కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజీ ఉంటుంది. యూనివర్శిటీల్లో పని చేస్తున్న అర్హత గల కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి ప్రతి సర్వీస్ ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు వెయిటేజీ ఇస్తారు. 

https://apuniversitiesrecruitment.apcfss.in సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అందులో కామన్‌ రిక్రూట్‌మెట్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించిన తర్వాత రిజిస్ట్రేష్ ఫారమ్ ప్రింట్‌ అవుట్ తీసుకొని, అన్ని సంబంధిత పత్రాల హార్డ్ కాపీలను సెల్ఫ్‌  అసిస్టేషన్ చేసి  సంబంధిత యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువు ఎప్పుడు?

ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 18 నుండి ప్రారంభమై జూన్ 8 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హతలు ఏమిటి?

సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు నెట్‌/సీఎస్‌ఐఆర్‌ నెట్/సెట్‌/స్లెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పీహెచ్‌డీ చేసిన వారికి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్‌ తర్వాత ఏముంటుంది?

స్క్రీనింగ్ టెస్ట్‌ తర్వాత అభ్యర్థుల అకాడమిక్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఆపై ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంపిక ప్రక్రియలో ఏదైనా వెయిటేజీ ఉంటుందా?

అవును, యూనివర్శిటీల్లో పని చేస్తున్న అర్హత గల కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి ప్రతి సర్వీస్ ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు వెయిటేజీ ఇస్తారు.

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget