అన్వేషించండి

SSC CGL 2025 Final Result: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2025 ఫైనల్ రిజల్ట్స్‌ విడుదల!15 వేల మందికిపైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు! 

SSC CGL 2025 Final Result: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 15,118 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SSC CGL 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి, 15,118 ఉద్యోగాలకు ఎంపిక జాబితా.
  • అన్ రిజర్వ్డ్, OBC, SC, ST, EWS వర్గాల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాతే కేంద్ర ప్రభుత్వ గ్రూప్ B, C ఉద్యోగాలకు నియామకం.
  • SSC అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల PDF అందుబాటులో ఉంది.

SSC CGL 2025 Final Result: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission Recruitment) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ లెవల్ 2025 ఫైనల్ రిజల్ట్స్‌ పోర్టల్‌లో పెట్టింది. అధికారికంగా తుది ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని(Government Jobs 2026) 15,118 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను గత ఏడాది విడుదల చేశారు. వివిధ దశల వడపోత తర్వాత ఇప్పుడు సెలెక్టెడ్‌ జాబితాను(SSC CGL Selected Candidates List) ఆన్‌లైన్‌లో ఉంచారు.

ఇప్పుడు విడుదల చేసిన అభ్యర్థులు ఫైనల్ దశ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వారు మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ గ్రూప్‌ బి, గ్రూప్ సీ విభాగాల్లో బాధ్యతలు చేపట్టేందుకు అనుమతి ఇస్తారు. 

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2025 ఫైనల్ రిజల్ట్స్‌  పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన జాబితాలో వివిధ కేటగిరీల్లో(SSC Merit List Category Wise) ఎంత మంది ఎంపికయ్యారో వివరంగా కమిషన్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టిన వివరాల ప్రకారం 6458 మంది అన్‌రిజర్వ్డ్‌ కేటగిరిలో ఎంపికయ్యారు. 3832 మంది ఓబీసీ కోటాలో సెలెక్ట్ అయ్యారు. షెడ్యూల్‌ కులాల కోటా కింద 2,221 మంది, ఎంపికైతే, ఎస్టీ విభాగంలో 1132 మంది నియమితులయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీలో 1475 మంది ఉద్యోగాలు పొందబోతున్నట్టు ఈ జాబితా చూస్తే అర్థమవుతుంది. 

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

తుది ఫలితాల జాబితాను పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీన్ని చూడాలంటే అభ్యర్థులు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.inను విజిట్ చేయాలి. అక్కడ హోమ్‌ పేజీలో SSC CGL Final Results 2025 అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఫలితాల పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ కేటగిరిలో ఏ విభాగంలో(Group B, Group C) ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఎంత మంది ఎంపికయ్యారో వివరాలు ఉంటాయి.  కటాఫ్ వివరాలు కూడా ఇచ్చారు. పోస్టుల వారీగా ఎంత మందిని సెలెక్ట్ చేశారు. ఆ పోస్టుకు సెలెక్ట్ అయిన ఆఖరి అభ్యర్థి మార్కులు, పుట్టిన తేదీని కూడా ఇచ్చారు. 

ఇందులో ఎంపికైన వారు ఏం చేయాలి?

తుది ఫలితాల్లో ఎంపిక అభ్యర్థులు వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల్లో(Central Government Jobs) చేరడానికి ముందు మరో ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతలు, సామాజిక వర్గం, ఇతర పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వారికి కేటాయించిన డిపార్ట్‌మెంట్ నుంచి నియామక ఉత్తర్వులు అందుతాయి. 

Frequently Asked Questions

SSC CGL 2025 తుది ఫలితాలు ఎక్కడ ప్రకటించబడ్డాయి?

SSC CGL 2025 తుది ఫలితాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in) లో PDF రూపంలో ప్రకటించబడ్డాయి.

SSC CGL 2025 ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయి?

SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 15,118 ఉద్యోగాలను భర్తీ చేశారు.

ఫలితాల జాబితాలో వివిధ కేటగిరీల వారీగా ఎంత మంది ఎంపికయ్యారు?

అన్‌రిజర్వ్‌డ్‌: 6458, ఓబీసీ: 3832, ఎస్సీ: 2221, ఎస్టీ: 1132, ఈడబ్ల్యూఎస్: 1475 మంది ఎంపికయ్యారు.

ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు తదుపరి ఏం చేయాలి?

ఎంపికైన అభ్యర్థులు తమ విద్యార్హతలు, సామాజిక వర్గం, ఇతర పత్రాలను ధృవీకరించుకోవాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి నియామక ఉత్తర్వులు అందుతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget