AP DSC 2025లో క్రీడా కోటా ఫలితాలు విడుదల! మీ పేరు ఉందో లేదో వెంటనే చూడండి, అభ్యంతరాలుంటే ఇలా తెలపండి!
Andhra Pradesh DSC 2025 Results: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ఫలితాాలు విడుదలకు రంగం సిద్ధమవుతోంది. మొదట స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టారు.

Andhra Pradesh DSC 2025 Results:ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు పూర్తి అయ్యి నెల పదిహేను రోజులు దాటింది. వివిధ కారణాలతో పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం తొలి ఫలితాలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే ఐదు రోజుల్లో తెలియజేయాలని సూచిస్తున్నారు.
మెగా డీఎస్సీ 2025లో క్రీడా కోటా కింద ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కోటాలో ఎంపికైన వారి వివరాలను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇప్పుడు విడుదల చేసిన ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఈ నెల 13 అర్థరాత్రి 12 గంటలలోపు వెబ్ సైట్ ద్వారానే అభ్యంతరాలు చెప్పాలని సూచించారు.
జాబితాలను ఎలా చూడాలి?
స్పోర్ట్స్ కోటాలో ప్రతి జిల్లాలో కొన్ని పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. వాటికి ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా భర్తీ చేస్తోంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడల్లో సర్టిఫికెట్లు ఉన్న వారు ఈ పోస్టులకు భర్తీ చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తును అధికారులు వడపోసి ఓ లిస్ట్ ప్రిపేర్ చేశారు. వారి వద్ద ఉన్న సర్టిఫికెట్లను కూడా పరిశీలించారు. అనంతరం ఇప్పుడు ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా పొందాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
ముందు ప్రభుత్వం ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌లు http://sportsdsc.apcfss.in, లేదా
http://sports.ap.gov.in సందర్శించాలి.
అందులో స్పోర్ట్స్ కోటా పోస్టుల వివరాలు ఉంటాయి. దానిపై క్లిక్ చేయాలి.
అలా క్లిక్ చేస్తే జాబితా వస్తుంది. అందులో ఉన్న వివరాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రిపోర్ట్ చేయవచ్చు.
ఆగస్టు 13వ తేదీ అర్థరాత్రి వరకు అవకాశం ఇచ్చిన అధికారులు తర్వాత రోజు నుంచి వాటిని పరిశీలిస్తారు. అభ్యంతరాలు
నిజమా కాదా అని తేలిన తర్వాత ఫైనల్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెడతారు.
డీఎస్సీ 2025ఫలితాలు ఎప్పుడు?
జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు జులై మొదటి వారంతో ముగిశాయి. ఆగస్టు మొదటి వారంలోనే ఫలితాలు విడుదల చేసి ఆగస్టు 15 కల్లా కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అభ్యర్థులు చేసిన పొరపాట్లు, కీలో వచ్చిన మిస్టేక్స్ వల్ల ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.





















