By: ABP Desam | Updated at : 06 Jun 2023 07:15 AM (IST)
Edited By: omeprakash
పోలీసు అభ్యర్థుల దరఖాస్తుల సవరణ
తెలంగాణలో పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించిన ఫైనల్ పరీక్షల ఫలితాలు మే 31న వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ తుదిదశకు చేరినట్లయింది. ఇక కటాఫ్ మార్కులు ప్రకటించడమే తరువాయి. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తెలంగాణలో పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించిన ఫైనల్ పరీక్షల ఫలితాలు మే 31న వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ తుదిదశకు చేరినట్లయింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదుపాయం జూన్ 6న ఉదయం 8 గంటల నుంచి జూన్ 8న రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. నియామక మండలి నిర్వహించిన అన్ని పరీక్షల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లకు సంబంధించి 0.38 వినతులు మాత్రమే వచ్చాయన్నారు. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం 3,55,387 జవాబు పత్రాలు ఉండగా వాటిలో కేవలం 1338 జవాబు పత్రాలకు సంబంధించి మాత్రమే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ల దరఖాస్తులు వచ్చాయని నియామక మండలి ఛైర్మన్ తెలిపారు. వ్యాసరూప సమాధానాలకైతే కేవలం జవాబుపత్రంలో వేసిన మార్కులను లెక్కిస్తామని, ఓఎమ్మార్ షీట్‌లో అయితే తప్పులు, ఒప్పులు, ఖాళీగా వదిలేసిన వాటిని పరిశీలించి, అభ్యర్థికి సమంజసమైన మార్కులే వచ్చాయా అన్నది పరిశీలిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు. వీటి ఫలితాలను జూన్ 6న విడుదల చేయనున్నారు.
తప్పుల సవరణ ఇలా..
➥ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ తప్పులను మూడు రకాలుగా విభజించారు. ఎ-కేటగిరీ తప్పులను నియామక మండలి ఉద్యోగుల సమక్షంలో మాత్రమే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పేరు, జెండర్, కులం, స్థానికత, ఫొటో, సంతకం, వయసు వెసులుబాటు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, క్రీడలకు సంబంధించిన రిజర్వేషన్ పొందడం వంటి అంశాలు ఉంటాయి.
➥ బి-కేటగిరీ తప్పులను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత ఎస్పీ, కమిషనర్ల సమక్షంలో సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థి ఇంటిపేరు, ఆధార్ నంబరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటివి ఈ తరగతిలో ఉంటాయి. ఇక అభ్యర్థి లాగిన్ ఐడీ వంటివి సి-కేటగిరీ కిందికి వస్తాయని, వీటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యంకాదని ఈ ప్రకటనలో వెల్లడించారు.
ఫీజు ఇలా..
➥ఎ-కేటగిరీ తప్పులకైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3,000 ఇతరులు రూ.5,000 చెల్లించాలి. బి-కేటగిరి తప్పులకైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000, ఇతరులు రూ.3,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
➥ అభ్యర్థులు తమ దరఖాస్తు సరిదిద్దుకోవాల్సిన అభ్యర్థులు వారికి కేటాయించిన లాగిన్ ఐడీ ద్వారా నిర్ణీత తేదీల్లో ఈ సదుపాయం వినియోగించుకోవాలని, కేటగిరీని బట్టి ఫీజు చెల్లిస్తే నియామక మండలి సిద్ధం చేసిన టెంప్లెంట్ కనిపిస్తుందని, దాన్ని పూర్తి చేసి SUBMIT చేయగానే మరో పత్రం వస్తుందని, దాన్ని ప్రింట్ తీసుకొని ధ్రువపత్రాల పరిశీలన సమయంలో తమ వెంట తీసుకొని రావాల్సి ఉంటుంది. రెండు కేటగిరీల్లో తప్పులు సరిదిద్దుకోవాలంటే రెండింటికీ సంబంధించిన ఫీజు చెల్లించాల్సిందే. తప్పులు దొర్లినట్లు భావిస్తున్న వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తేదీలను పోలీసు నియామక మండలి త్వరలోనే వెల్లడించనుంది.
➥ కుల ధ్రువీకరణ పత్రం 2014 జూన్ 2, నాన్ క్రీమీలేయర్ పత్రం 2021 ఏప్రిల్ 1, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ధ్రువపత్రం కూడా 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసి ఉన్నవాటిని మాత్రమే అనుమతించనున్నారు.
త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. 2014 జూన్ 2 తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకొంటామని తెలిపారు. 2021 ఏప్రిల్ 1 తర్వాత అభ్యర్థులు తీసుకొన్న నాన్ క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లనే అంగీకరిస్తామని స్పష్టంచేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వనీయంగా తెలిసింది. అనంతరం కటాఫ్ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్, ఇతర కేసుల వెరిఫికేషన్ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
Also Read: ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణకు ఏర్పాట్లు, జులై నుంచి అభ్యర్థులకు ట్రైనింగ్!
Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
JL Exam Key: జేఎల్ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>