అన్వేషించండి

Oracle layoffs: ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!

Oracle Job Cuts: దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఒరాకిల్ 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో సీనియర్ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు.

AI Hitting Senior Employees First: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  సృష్టించిన ప్రకంపనలతో ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్  భారీగా ఉద్యోగ కోతలను ప్రకటించింది. సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఆందోళన రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలం పాటు సంస్థకు సేవలందించిన సీనియర్ నిపుణులు కూడా ఈ వేటుకు గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో 33 ఏళ్ల అనుభవం ఉన్న సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ సైతం ఉదయాన్నే వచ్చిన ఈ-మెయిల్స్‌తో నివ్వెరపోయారు.

కేవలం ఒరాకిల్ మాత్రమే కాకుండా మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇటీవల వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  లో భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు, పని సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మానవ వనరులను తగ్గిస్తున్నాయి. ఆటోమేషన్ పెరగడం వల్ల ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని పెట్టుబడిదారులు భావిస్తుండటంతో, లే-ఆఫ్స్ ప్రకటించిన వెంటనే ఆయా కంపెనీల షేర్ ధరలు పెరగుతున్నాయి.  

ఈ పరిణామం అటు సీనియర్లను, ఇటు ఫ్రెషర్లను సమానంగా దెబ్బతీస్తోంది. భారీ జీతాలు తీసుకునే సీనియర్ మేనేజర్ల స్థానాన్ని ఏఐ టూల్స్ ,  తక్కువ వేతనానికి వచ్చే జూనియర్ ఉద్యోగులతో భర్తీ చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు, కోడింగ్ ,  టెస్టింగ్ వంటి ప్రాథమిక పనులను ఏఐ పూర్తిగా ఆక్రమించడంతో, కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఇప్పుడు ఐటీ రంగంలో నిలబడాలంటే కేవలం అనుభవం ఉంటే సరిపోదని, ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.           

సాధారణంగా ఆర్థిక మాంద్యం సమయంలో జరిగే ఉద్యోగ కోతలకు భిన్నంగా, ప్రస్తుతం కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం తమ రూపురేఖలను మార్చుకుంటున్నాయి.  ఏఐ ఫస్ట్ విధానంలో భాగంగా జరుగుతున్న ఈ పునర్వ్యవస్థీకరణ ఐటీ నిపుణులలో తీవ్ర అభద్రతాభావాన్ని పెంచుతోంది. నైపుణ్యం ఉన్నవారే ఆల్గారిథమ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతుండటం చూస్తుంటే, టెక్ ప్రపంచం ఒక విప్లవాత్మకమైన కానీ కఠినమైన మార్పు దిశగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Embed widget