ASL: ఏఎస్‌ఎల్‌లో 90 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
ASL Apprentice Recruitment: హైదరాబాదులోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ(ఏఎస్ఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
![ASL: ఏఎస్‌ఎల్‌లో 90 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా advanced systems laboratory hyderabad has released notification for the recruitment of apprentice posts ASL: ఏఎస్‌ఎల్‌లో 90 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/3ce672d0aaea6c7b66446183264c892c1709087040414522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ASL Apprentice Recruitment: హైదరాబాదులోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ(ఏఎస్ఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా; ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, సీఓపీఏ, మెషినిస్ట్ ట్రేడుల్లోఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా) అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటీస్ (ITI) కోసం అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. సరైన అర్హతలున్నవారు ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ యొక్క భారతీయ రక్షణ ప్రయోగశాల.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 90
* అప్రెంటిస్ పోస్టులు
⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 15 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 05 పోస్టులు
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 04
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
➥ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 02
అర్హత: కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
⏩ టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 10 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 05 పోస్టులు
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 05 పోస్టులు
అర్హత: డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.
⏩ ట్రేడ్ (ఐటీఐ) అప్రెంటిస్: 65 పోస్టులు
➥ ఫిట్టర్: 33
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రీషియన్: 12
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రానిక్ మెకానిక్: 06
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
➥ టర్నర్: 05
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
➥ COPA: 05
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
➥ మెషినిస్ట్: 04
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000; ట్రేడ్ అప్రెంటిస్‌పోస్టులకు రూ.7000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director,
Advanced Systems Laboratory (ASL),
Kanchanbagh PO, Hyderabad-500058
దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)