అన్వేషించండి

Anganwadi Jobs: అంగన్‌వాడీ కేంద్రాల్లో 9 వేల ఖాళీలు, జిల్లాలవారీగా త్వరలో నోటిఫికేషన్లు

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9000 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తోంది.

TS Anganwadi Vacancies: తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. నియామక ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.  ఈ పోస్టులకు ఏడు, పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులు. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇంటర్ అర్హత తప్పనిసరి...
గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం..టీచర్‌తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాసై ఉండాలి. అదేవిధంగా వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లు కాగా, 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో.. టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది.

తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌తోపాటు, హెల్పర్ ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్నవారికి సూపర్ వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. 

జిల్లాస్థాయిలోనే సరకుల సేకరణ..
అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరకులకు రాష్ట్రస్థాయిలో కేంద్రీకృత సమీకరణ విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. జిల్లా స్థాయిలోనే జిల్లా కొనుగోళ్ల కమిటీల ఆధ్వర్యంలో సమీకరించుకోవాలని పేర్కొంటూ.. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. కొన్ని సరకులకు రాష్ట్రస్థాయిలో ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు నిర్వహించడంతో గుత్తేదారులు కుమ్మక్కై ధరలు పెంచుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంగానే గతేడాది కందిపప్పు సమీకరణలో, కేంద్రాలకు సరఫరాలో ఆలస్యమైంది.

ALSO READ:

'గ్రూప్-1' పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్? కొత్తవాళ్లకే అవకాశం!
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో గ్రూప్-1 కేటగిరీ ఖాళీల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి, వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థికశాఖ కోరగా.. అన్ని డిపార్ట్ మెంట్లలో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయని అధికారులు తేల్చారు. మరో 23 పోస్టుల భర్తీపై వివాదాలుండటంతో, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఆర్థికశాఖ భావిస్తోంది. దీనికితోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలనూ సేకరించాలని యోచిస్తున్నారు. కనీసం వంద పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
https://telugu.abplive.com/jobs/telangana-state-public-service-commission-to-release-group-1-supplementary-notification-soon-143196

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget