By: ABP Desam | Updated at : 11 Jan 2022 08:06 AM (IST)
'అదిరే' అభి... 'హైపర్' ఆది
'జబర్దస్త్' షో నుంచి 'అదిరే' అభి టీమ్ వెళ్లిపోయింది. ఆయనతో పాటు మరో టీమ్ లీడర్ 'జిగేల్' జీవన్ కూడా 'జబర్దస్త్'ను వదిలేశాడు. ఈటీవీ నుంచి వెళ్లిన ఇద్దరూ... ఇప్పుడు 'స్టార్ మా' ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న 'కామెడీ స్టార్స్' షో చేస్తున్నారు. అయితే... 'అదిరే' అభి ద్వారా 'జబర్దస్త్'కు వచ్చిన 'హైపర్' ఆది, ఇంకా అదే షోలో కంటిన్యూ అవుతున్నారు. యూట్యూబ్‌లో టాప్ వ్యూస్ వస్తున్న స్కిట్స్‌లో అతడి స్కిట్స్ తప్పకుండా ఉంటున్నాయి. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో అభి గురించి 'హైపర్' ఆది స్పందించారు.
"మీ గురువు గారు అభి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు కదా! మీ అభిప్రాయం ఏంటి?" అనే ప్రశ్న 'హైపర్' ఆదికి ఎదురైంది. అందుకు బదులుగా ఆయన "అభి అన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి అభి కారణం. ఒక్కొక్కరూ ఒక్కో స్టాండ్ తీసుకుంటారు. ఆయనకు ఉన్న ఇది ఏమిటో నాకు తెలియదు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను తప్ప కామెంట్ ఏమీ చేయను" అని చెప్పారు.
'హైపర్' ఆది కూడా జబర్దస్త్ వదిలేసి వేరే ఛానల్‌కు వెళ్లాలని అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వాటిపై కూడా ఆయన స్పందించారు. "నేను వేరే ఛానల్‌కు షిఫ్ట్ అవుదామని అనుకోలేదు. రెండు ఛానళ్లలో చేద్దామని అనుకున్నాను. అలా కుదరదని అన్నారు. అందుకని, ఒక దాంట్లో ఆగిపోయా" అని 'హైపర్' ఆది వివరించారు. ఈటీవీ 'జబర్దస్త్'లో చేస్తున్న అభి, స్టార్ మా రియాలిటీ షో 'బిగ్ బాస్' ప్రతి సీజన్‌లోనూ ఒకసారి అయినా కనిపించి సందడి చేస్తుంటారు.
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: సహజీవనం చేస్తున్న ఆ హీరోహీరోయిన్లు? వారిద్దరి మధ్య వయసు తేడా ఎంతంటే...
Also Read: సుకుమార్ బర్త్‌డేను వైఫ్ ఎలా సెలబ్రేట్ చేసిందో చూశారా?
Also Read: ప్రభాస్ ని టెన్షన్ పెడుతోన్న 'బ్రహ్మాస్త్ర'.. అసలు కథేంటంటే..?
Also Read: సినిమా ఇండస్ట్రీను అవమానించారు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి సీరియస్..
Also Read: క్రేజీ డైరెక్టర్ మూవీతో హీరోగా ఫేస్ టర్నింగ్ ఇస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Year Ender 2025: ఓటీటీ రైట్స్‌తో కోట్లకు కోట్లు... 2025లో హయ్యస్ట్ డీల్ - రజనీ, పవన్, సల్మాన్‌ను బీట్ చేసిన హీరో ఎవరంటే?
Year Ender 2025: ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఏమిటి... ఫుల్ లిస్ట్ ఇదుగో
Avatar Fire And Ash First Day Collection: 'అవతార్ 3'కు ముందు... 2025లో ఇండియాలో టాప్10 ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ సినిమాలు ఏవో తెలుసా?
Mrs Deshpande OTT: మాధురి దీక్షిత్ క్రైమ్ థ్రిల్లర్... ఇవాళ్టి నుంచి మిస్సెస్ దేశ్‌పాండే స్ట్రీమింగ్ - ఎక్కడ చూడాలంటే?
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?