ABP  WhatsApp

ZyCoV-D COVID-19 Vaccine: జైకోవ్-డీ టీకాకు కుదిరిన రేటు.. ఇక వ్యాక్సినేషనే లేటు.. ఒక డోసు ఎంతంటే?

ABP Desam Updated at: 08 Nov 2021 08:43 PM (IST)
Edited By: Murali Krishna

జైకోవ్-డీ కొవిడ్ టీకా ధరను సంస్థ నిర్ణయించింది. ఈ టీకాను మూడు డోసులుగా తీసుకోవాలి.

జైకోవ్-డీ వ్యాక్సిన్ ధర ఫిక్స్

NEXT PREV

జైకోవ్-డీ కొవిడ్ 19 వ్యాక్సిన్ ధరను ప్రకటించింది జైడస్ క్యాడిలా. ఈ వ్యాక్సిన్ కోటి డోసులను ఇటీవల కేంద్రం ఆర్డర్ చేసింది. దీంతో వ్యాక్సిన్ ధరను నిర్ణయించింది సంస్థ. అధికారిక సమాచారం ప్రకారం ఒక వ్యాక్సిన్ డోసు ధరను రూ.265గా నిర్ణయించారు.


సూది అవసరం లేకుండా ఇచ్చే టీకా ఒక డోసు ధర. రూ.93గా సంస్థ ప్రకటించింది. కేంద్రంతో సంప్రదించిన అనంతరం ఈ ధరను నిర్ణయించినట్లు తెలిపారు. జైడస్ క్యాడిలా ఎండీ డా. షర్విల్ పటేల్ ఈ మేరకు ప్రకటించారు.



వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జైకోవ్-డీతో మా వంతు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సూది లేకుండా చేసే వ్యాక్సిన్ కారణంగా మరి కొంతమంది టీకా తీసుకునేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా 12-18 ఏళ్ల వయసున్న వాళ్లు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు.     -        డా. షర్విల్ పటేల్, జైడస్ క్యాడిలా ఎండీ


కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకా ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ ఆధారిత కొవిడ్ టీకాగా నిలిచింది. అత్యవసర వినియోగానికి కూడా అనుమతి లభించిన కారణంగా డోసులు అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో చేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇందుకోసమే కోటి డోసులకు ఆర్డర్ ఇచ్చింది. నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


సూది అవసరం లేకుండా ఇచ్చే ఈ టీకా పంపిణీకి ప్రత్యేక జెట్ అప్లికేటర్ అనే పరికరాన్ని వినియోగించనున్నారు. మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను ప్రతి 28 రోజుల గడువులో తీసుకోవాలి. వీటిని కూడా ప్రభుత్వం ఉచితంగానే రాష్ట్రాలకు అందించనుంది.


Also Read: Ambani Antilia Update: ట్యాక్సీ డ్రైవర్.. ఓ బ్యాగ్.. ఇద్దరు మనుషులు.. అంబానీ ఇంటి వద్ద హైఅలర్ట్!


Also Read: Lakhimpur Kheri Violence: లఖింపుర్ కేసులో యూపీపై సుప్రీం ఫైర్.. హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో విచారణ


Also Read: Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూ, కంగనా రనౌత్‌ సహా 119 మందికి పద్మ పురస్కారాలు


Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు


Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!


Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే


Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి


Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే


Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?


Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 08 Nov 2021 08:43 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.