ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఓ సైనికుడు తోటి సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పారామిలటరీ దళాలు ఉన్న క్యాంప్ వద్ద జవాన్ కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
ఏం జరిగింది?
జిల్లాలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ కాంప్‌పై తెల్లవారుజామున 3.45 నిమిషాలకు జవాన్ కాల్పులు జరిపాడు. రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్‌కు ఇది 400 కిమీ దూరంలో ఉంది. ఈ మేరకు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జవాను.. తన సర్వీస్ వెపన్.. ఏకే-47 నుంచే కాల్పులు చేసినట్లు తేలింది. నిందితుడ్ని వెంటనే అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తున్నట్లు ఐజీ తెలిపారు. గాయాలైన జవాన్లను తెలంగాణ భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.
Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి