మైగ్రేన్ లేక వాస్క్వులర్ హెడెక్... దీనినే పార్శ్వపు నొప్పి అంటారు. తలకు ఒకవైపు మాత్రమే వస్తుంది. చాలా తీవ్రంగా వచ్చే ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. ఏటా 848 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తాంగా మైగ్రేన్ తో బాధపడుతున్నారు. మైగ్రేన్ వస్తే రెండు మూడు రోజుల వరకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు అన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదని, జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ఆహారనిపుణులు. 
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


ఎలాంటి ఆహారాన్ని దూరం పెట్టాలంటే...
1. మైగ్రేన్ తో బాధపడే వారు చాకొలెట్లకు దూరంగా ఉండాలి. వీటిని తింటే పార్శ్వపు నొప్పి 22 శాతం పెరుగుతుంది. కాబట్టి చాకోలెట్లను చూసినా మీకూ నోరూరకూడదు. లేదంటే మైగ్రేన్ భరించేందుకు సిద్ధమవ్వాలి. 
2. షుగర్ ఫ్రీ పేరుతో చాలా తినుబండారాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అవన్నీ మధుమేహం ఉన్నవారి కోసం తయారుచేసినవి. వాటిలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ కలుపుతారు. వాటిని మైగ్రేన్ ఉన్నవాళ్లు తినకూడదు. 
3. మాంసాహారులు చికెన్, మటన్, చేపలు వంటి తాజాగా ఉన్నప్పుడు వండుకుని తినేయాలి. వండిన ఆ కూరను ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు తినడం వంటివి చేయకూడదు.  నిల్వ చేసిన మాంసాహారాల వల్ల కూడా మైగ్రేన్ నొప్పి పెరిగే అవకాశం ఉంది. 
4. చీజ్ తినడం పూర్తిగా మానకుంటే మంచిది. ఎందుకంటే చీజ్ తినే అలవాటున్న వారికి, మైగ్రేన్ కూడా ఉంటే... నొప్పి 35 శాతం పెరుగుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. 
5. కాఫీ, గ్రీన్ టీలను చాలా పరిమితంగా తాగాలి. అంటే రోజుకోసారి చాలు. ఎక్కువగా తాగితే అందులో ఉండే కెఫీన్ కారణంగా నొప్పి పెరుగుతుంది. 
6. టేస్టింగ్ సాల్ట్ వాడినా పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. దీన్ని ఎక్కువగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో వాడతారు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి