మేషం
ఈ రోజు మానసికంగా గందరగోళానికి గురవుతారు.  ఎవరితోనైనా గొడవలు రావొచ్చు. కుటుంబ సభ్యులు మీపై కోపగించుకునే అవకాశం ఉంది.  ఇతరుల భావాలను గౌరవించండి. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు తప్పవు.  రిస్క్ తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునే మార్గాలు చూసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. 
వృషభం
మీకు ఈ రోజంతా శుభసమయమే. వ్యాపారస్తులకు లాభాలొస్తాయి. ఇతరులకోసం ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. సంతోషంగా ఉంటారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
మిథునం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి బహుమతి అందుకుంటారు.  స్నేహితులను కలుస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు అనుకూల సమయం.  కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఒక ముఖ్యమైన విషయంపై నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read:  నాగ పూజ మూఢనమ్మకమా- సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, వేటిని పూజించాలి
కర్కాటకం
ఈరోజు సమస్యాత్మకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. కెరీర్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 
సింహం
ఈరోజు మీరు స్నేహితుడి నుంచి శుభవార్త అందుకుంటారు. వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. చెడు ఆలోచనలు వస్తాయి. ఎవరితోనైనా మనస్పర్థలు రావొచ్చు. తలనొప్పి, టెన్షన్ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మతం పట్ల ఆసక్తి చూపుతారు.
కన్య
ఉద్యోగంలో లాభం ఉంటుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులు విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందడుగు వేయొచ్చు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరగొచ్చు.
Also Read:  ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
తుల
ఈరోజంతా బాగానే ఉంటుంది. వృత్తి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది.  ఒత్తిడి తీసుకోకండి. వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేయొచ్చు.  విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అవకాశాలు లభిస్తాయి. ఆహారం విషయంలో నియంత్రణ అవసరం.
వృశ్చికం
దినచర్యలో మార్పు ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది.మీ నైపుణ్యంతో ఇతరుల సమస్యలను పరిష్కరించండి. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఫ్యాషన్, ఇంజినీరింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. దంపతులు సంతోషంగా ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 
ధనుస్సు
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుడితో వాగ్వాదం ఉండవచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు నియంత్రించేందుకు  ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. మీ లోపాలపై ఎక్కువ దృష్టి పెట్టవద్దు. ఇంటి విషయాల్లో బయటి వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది కాదు. వృత్తి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
మకరం
ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.  మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.  డబ్బు, ఆస్తి, పెట్టుబడికి సంబంధించిన విషయాలకు ఈ రోజు చాలా అనుకూలమైనది. బాధ్యతలు శ్రద్ధగా నిర్వర్తిస్తారు.  వ్యాపారంలో పురోగతి కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేయవచ్చు. కార్యాలయంలో శుభవార్త వింటారు.
కుంభం
కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు పొందుతారు. బంధువులతో మీ సంబంధాలు బాగుంటాయి. యోగా, ధ్యానం,  వ్యాయామాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.  కోర్టు కేసులు ముందుకు సాగుతాయి. 
మీనం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఒత్తిడి కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఎవరి వివాదాల్లోనూ  తలదూర్చవద్దు.
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి