దీపావళి పండుగ వస్తూనే ఆధ్యాత్మిక పరిమళాన్ని తనతో తీసుకు వస్తుంది. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనదంటారు. శివ భక్తులు, విష్ణు భక్తులకు కూడా ఎంతో ప్రియం కార్తీకం. శివాలయాల్లో దీపతోరణాలు, ఆకాశాదీపాలు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక భక్తులంతా తెల్లవారుజామున చన్నీటి స్నానాలు,  ఉపవాస దీక్షలు, కేదారేశ్వర నోములు చేస్తూ కార్తీక మాసం అంతా చాలా పవిత్రమైన భావనలో దేవుని సేవలో నిమగ్నమైపోతారు. ఈ ఏడాది నవంబరు 5 న కార్తీకమాసం ప్రారంభం కాగా నాలుగు సోమవారాలు వచ్చాయి. 
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఓవరాల్ గా కార్తీకంలో ముఖ్యమైన రోజులేంటంటే..
నవంబర్ 5 శుక్రవారం కార్తీక మాసం ప్రారంభం
నవంబర్ 6 శనివారం భగినీహస్త భోజనం
నవంబర్ 8 మొదటి సోమవారం, నాగులచవితి
నవంబర్ 15 రెండో సోమవారం, కార్తీక శుద్ధ ఏకాదశి
నవంబర్ 16 కార్తీక శుద్ధ ద్వాదశి
నవంబర్ 18 గురువారం కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం
నవంబర్ 22 మూడో సోమవారం
నవంబర్ 29 నాలుగో సోమవారం
నవంబర్ 30 బుధవాం కార్తీక బహుళ ఏకాదశి
డిసెంబరు 1 గురువారం కార్తీక బహుళ ద్వాదశి
డిసెంబరు 2 గురువారం మాస శివరాత్రి
డిసెంబరు 4 శనివారం కార్తీక అమావాస్య
డిసెంబరు 5 ఆదివారం పోలి స్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే... నిత్యం ధూప, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతాయో  ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అని చెబుతారు. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రధం. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్య దీపారాధన చేసే వారి సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి వారికి కాస్త ఉపశమనం ఇస్తోంది కార్తీక పౌర్ణమి. ఏడాదంతా దీపారాధన చేయని వారు కనీసం  కార్తీక పౌర్ణమినాడు 365 ఒత్తులు ( ఏడాదికి 365 రోజులు కాబట్టి  రోజుకొకటి చొప్పున 365) జత చేసి, వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ, దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇక కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి ఉపవాసాల విషయంలో ఎవరి ఓపిక వారిది. 
ఇవన్నీ చేస్తే మంచిదని పురాణాల్లో ప్రస్తావించారు, పెద్దలు చెప్పారు.కానీ ఇలా చేయనందున ఏదో జరిగిపోతుందనే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎవరి విశ్వాసం వారిది అని కూడా చెబుతారు.
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి