Anushka: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!

అనుష్క పుట్టినరోజు సందర్భంగా... ఆమె ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఆదివారం కొత్త చిత్రాన్ని ప్రకటించింది. దీనికి మహేష్ దర్శకుడు. #Anushka #UVCreations #MaheshBabuP

Continues below advertisement

అనుష్కతో యూవీ క్రియేషన్స్ రెండు సినిమాలు నిర్మించింది. ప్రభాస్ హీరోగా నటించిన 'మిర్చి'తో యూవీ సంస్థ ప్రారంభమైంది. అందులో అనుష్క హీరోయిన్. ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో 'భాగమతి' నిర్మించింది. ఇప్పుడు అనుష్క, యూవీ క్రియేషన్స్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. అనుష్క 48వ చిత్రమిది. 

Continues below advertisement

అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆమెతో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. అనుష్క కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాను ప్రకటించారు. ఎప్పటి నుంచో ఆ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు. మహేష్ పి. గతంలో సందీప్ కిషన్ హీరోగా 'రా రా కృష్ణయ్య'కు దర్శకత్వం వహించారు. ఆయన ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే... ఆయన నటించడం లేదు. మరో యువ హీరో నటించనున్నారని తెలిసింది. అతను ఎవరనేది త్వరలో వెల్లడిస్తారు.

దాదాపు అనుష్క రెండేళ్ల తర్వాత మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొత్త  సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాది దాటింది. గత ఏడాది అక్టోబర్ 2న 'నిశ్శబ్దం' ఓటీటీలో విడుదలైంది. అయితే... అప్పటికి ఆ సినిమా చిత్రీకరణ పూర్తయి ఏడాది అయ్యిందని చెప్పుకోవాలి. కరోనా వల్ల థియేటర్లలోకి రావడం కుదరలేదు. చివరకు, ఓటీటీలో విడుదల చేశారు.

Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..

Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement