అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ శతాబ్ధంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్టు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం నవంబర్ 18, 19 తేదీలలో ఈ అద్భుతం వినువీధిలో కనువిందు చేయనుంది. ఆ రెండు రోజులలో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటూ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అద్భతాన్ని ఉత్తర, దక్షిణ అమెరికాలో నివసిస్తున్న ప్రజలతో పాటూ తూర్పూ ఆసియా, ఆస్ట్రేలియాలోని ప్రజలకు బాగా కనిపించబోతోంది. కాకపోతే అందరికీ ఒకేసారి కాకుండా కొన్ని నిమిషాలు లేదా గంటల తేడాతో కనువిందు చేస్తుంది. అమెరికాలోని తూర్పు తీరంలో నివసించే వారు నవంబర్ 19న తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు, అదే పశ్చిమ తీరంలో నివసించే వారు రాత్రి నవంబర్ 18వ తేదీన 11 నుంచే చూడొచ్చు. ఈ పాక్షిక చంద్రగ్రహణం 2021లో చివరిది. అంతేకాదు 2001 నుంచి 2100 శతాబ్ధంలో అత్యంత సుదీర్ఘమైనది కూడా. 
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
అదే భారత కాలమానానికి వచ్చే ఈ చంద్రగ్రహణం నవంబర్ 19 మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు ఏర్పడనుంది. ఆ సమయానికి చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వస్తుంది. ఆ మూడు గ్రహాలు ఒకే వరుసలో వచ్చి ఉంటాయి. ఆ సమయంలో సూర్యుని వెలుగు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దాదాపు 97శాతం చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. 
Also read: పేదవాడి యాపిల్ ‘జామ కాయ’... క్యాన్సర్ కణాలను నాశనం చేయగల సూపర్ ఫుడ్
మనదేశంలో ఎవరికి కనిపిస్తుంది?
మనదేశంలో అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. కార్తిక పౌర్ణమినాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ‘ఫ్రాస్ట్ మూన్’ అని పిలుస్తారు. అంటే మంచుతో కప్పబడిన చంద్రుడు అని అర్థం. 





Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి