మేషంప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు.  కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు మీ స్నేహితులతో  సంతోష సమయం గడుపుతారు.వృషభంవిద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యత పెరుగుతుంది.  రిస్క్ తీసుకోవద్దు. కొత్త వ్యక్తులను కలుస్తారు. బయటి ఆహారం తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మిథునంఈరోజు టెన్షన్ పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పాత పెట్టుబడులు లాభిస్తాయి. అదృష్టం కలిసొస్తుంది. సంతానం వైపునుంచి ఆందోళనలు తొలగిపోతాయి.  నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!కర్కాటకంఅడగకుండా సలహాలు ఇవ్వడం వల్ల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావొచ్చు. స్నేహితులతో కలిసి షికారు వెళ్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడపేందుకు  ప్రయత్నించండి. అధిక పనిభారం అలసటకు గురిచేస్తుంది. వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగేయండి.  భగవంతుని ఆరాధనపై మనస్సు లగ్నం చేయండి. సింహంకోపాన్ని నియంత్రించుకోండి.  మానసికంగా ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడం వల్ల వైద్యానికి ఎక్కువ ఖర్చవుతుంది.  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఆకస్మిక ప్రయాణ ప్రణాళికను రూపొందించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.కన్యఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. బంధుమిత్రులతో భేటీలో ఆహ్లాదకరమైన చర్చ ఉంటుంది. ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి.  న్యాయపరమైన వ్యవహారాలు ముందుగా సాగుతాయి. స్నేహితుడితో వాగ్వాదం ఉండొచ్చు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. యువత ఉద్యోగాలు పొందొచ్చు. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సోమరిగా ఉండొద్దు.Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!తులఖర్చులు తగ్గించండి. పనికిరాని విషయాల కోసం సమయం వృధా చేసుకోవద్దు. బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. భగవంతుని ఆరాధించడం వల్ల ధైర్యం పొందుతారు. బ్యాంకు, బీమా సంబంధిత పనులు పూర్తవుతాయి.వృశ్చికంఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది.  అదృష్టం కలిసొస్తుంది. సామాజంలో గౌరవాన్ని అందుకుంటారు. ఆస్తులు పెరుగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రయాణాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో అనుబంధం బలంగా ఉంటుంది. ధనుస్సుఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పెద్దల సలహాలు పాటించండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.  తలనొప్పి సమస్య ఉంటుంది. తెలియని వ్యక్తులను నమ్మవద్దు. భాగస్వాములతో సంతోషంగా ఉంటారు.  డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదృష్టం కలిసొస్తుంది.Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!మకరంపనికిరాని విషయాలకు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. రిస్క్ తీసుకోవద్దు. వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు. విద్యార్థులు లాభపడతారు. పిల్లల వైపునుంచి విజయం సాధిస్తారు.కుంభంఅనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులను కలుస్తారు. బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంమారే సూచనలున్నాయి.  తల్లిదండ్రులకు సేవ చేయండి. శత్రువులు చురుకుగా ఉంటారు. మీనంశత్రువులు అడ్డంకులు సృష్టించగలరు.  పనిభారం ఎక్కువై అలసిపోతారు.  ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?Also Read: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రంAlso Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి