శివ లింగ తమోద్భూతః కోటిసూర్య సమ ప్రభః 
కోటిసూర్య ప్రకాశ సమానమైన శివలింగం , జ్యోతిర్మయ స్వరూపుడైన మహదేవుని ప్రతి రూపం . అయితే కేవలం శిలారూప లింగాలే కాదు....రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలున్నాయి. వాటిలో మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి..30. అవేంటి? వాటిని పూజిస్తే వచ్చే ఫలితం ఏంటి?



1) గంధపు లింగం: రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.


2) నవనీత లింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.


3) పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.


4) రజోమయ లింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు.


5) ధ్యాన లింగం: యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి చెందుతుంది , సంతానం కలుగుతుంది.


6 ) తిలిపిస్టోత్థ లింగం: నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.


7) లవణ లింగం: హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .


8 ) కర్పూరాజ లింగం: కర్పూరంతో చేసిన లింగం . ముక్తి ప్రదమైనది.



9) భస్మమయ లింగం:భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది


10) శర్కరామయ లింగం  : సుఖప్రదం.


11) సద్భోత్థ లింగం :  ప్రీతికరని కలిగిస్తుంది.


12) పాలరాతి లింగం :  ఆరోగ్యదాయకం.


13) వంశా కురమయ లింగం: వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .


14) కేశాస్థి లింగం: వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.




15) పిష్టమయ లింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.


16) దధిదుగ్థ లింగం  :కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.


17) ఫలోత్థ లింగం  : ఫలప్రదమైనది.


18) రాత్రి ఫల జాత లింగం : ముక్తి ప్రదం


19) గోమయ లింగం :  కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు


20) దూర్వాకాండజ లింగం: గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది


21) వైడూర్య లింగం  : శత్రునాశనం , దృష్టి దోషహరం


22) ముక్త లింగం: ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది


23) సువర్ణ నిర్మిత లింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది


24) ఇత్తడి - కంచు లింగం  : ముక్తిని ప్రసాదిస్తుంది


25) రజత లింగం  :  సంపదలను కలిగిస్తుంది


26) ఇనుము - సీసపు లింగం  : శత్రునాశనం చేస్తుంది


27) అష్టధాతు లింగం  :  చర్మరోగాలను నివారిస్తుంది సర్వసిద్ధి ప్రదం


28) స్ఫటీక లింగం: సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది


29) తుష్టోత్థ లింగం  : మారణ క్రియకు పూజిస్తారు


30) సీతాఖండ లింగం: పటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది


Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read:  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి