Adi Guru Shankaracharya: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంతకీ ఆ విగ్రహం ప్రత్యేకతలేంటంటే...

Continues below advertisement

ఉత్తరాఖండ్‌ రుద్రప్రయాగ జిల్లా కేదార్‌నాథ్‌లో ఆదిగురువు శంకరాచార్య 12 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం పాదాల వద్ద కాసేపు కూర్చుని ధ్యానం చేశారు.
శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలు

Continues below advertisement

  • మైసూరుకు చెందిన శిల్పులు ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని క్లోరైట్ స్కిస్ట్ స్టోన్‌తో తయారు చేశారు
  • యోగిరాజ్ శిల్పి తన కుమారుడి సహకారంతో విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేశారు
  • సెప్టెంబరు 2020లో మైసూరుకు చెందిన శిల్పి విగ్రహాన్ని నిర్మించే పనిని ప్రారంభించినప్పుడు విగ్రహాన్ని చెక్కడం కోసం మొత్తం 120 టన్నుల రాయిని సేకరించారు.
  • తొమ్మిది నెలల పాటు రోజుకి 14 గంటల పాటు శ్రమించి శంకరాచార్య విగ్రహాన్ని  పూర్తి చేశామన్నారు శిల్పి యోగిరాజ్
  • విగ్రహానికి మెరుపు వచ్చేందుకు కొబ్బరి నీళ్లను పాలిష్ చేశామన్న శిల్పి యోగిరాజ్
  • కూర్చున్న భంగిమలో కనిపించే ఆదిశంకరాచార్యలు విగ్రహం బరువు  35టన్నులు
    భారతదేశ వ్యాప్తంగా ఉన్న శిల్పుల నుంచి నమూనాలను ఆహ్వానించిన ప్రభుత్వం తమ మోడల్ ను ఫైనల్ చేసిందని శిల్పి యోగిరాజ్ సంతోషంగా చెప్పారు. అప్పటి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వ్యక్తిగతంగా పురోగతిని పర్యవేక్షించారని,  ఏడుగురితో కూడిన బృందంతో విగ్రహానికి పనిచేశానన్నారు. కర్ణాటక  మైసూరులో చెక్కిన ఈ విగ్రహం జూలైలో చినూక్ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు తీసుకెళ్లారు

ఆదిశంకరాచార్య ఎవరు?
ఆదిశంకరాచార్య 8వ శతాబ్దానికి చెందిన కేరళలో జన్మించిన భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త. భారతదేశం అంతటా నాలుగు మఠాలను స్థాపించడం ద్వారా అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేయడంలో, హిందూ మతాన్ని ఏకం చేసేందుకు కృషిచేశారు.  ఆదిశంకరాచార్య ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌లో సమాధి అయ్యారని చెబుతారు. ఆ రాష్ట్రంలో చమోలి జిల్లాలో  పీఠంలో ఒకదాన్ని స్థాపించిన శంకరాచార్యులు,  మిగిలిన మూడు మఠాలు పశ్చిమాన ద్వారక, తూర్పున జగన్నాథ్ పూరి, దక్షిణాన శృంగేరిలో ఉన్నాయి.
Also Read: ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం ! దీపావళి టపాసులే కారణమా?
Also Read: కన్నీటి పర్యంతమైన సూర్య... దివంగత కథానాయకుడికి నివాళి
Also Read: యంగ్ టైగ‌ర్ కోసం సూప‌ర్‌స్టార్‌... మ‌హేష్‌తో ఎన్టీఆర్ షో క్లైమాక్స్‌!
Also Read: కొత్తగా 12,729 కరోనా కేసులు.. బాగా ఎగబాకిన రికవరీ రేటు
ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola