యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న లేటెస్ట్ షో 'ఎవరు మీలో కోటీశ్వరుడు'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌తో షో ప్రారంభం అయ్యింది. మరి, ముగింపు? ఎవరితోనో తెలుసా?? సూపర్ స్టార్ మహేష్ బాబుతో! ఎన్టీఆర్ కోసం ఈ షోకి మహేష్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ విజువల్స్ కొన్ని లీక్ అయ్యాయి. మహేష్ ఎపిసోడ్ షూట్ చేసి కూడా చాలా రోజులు అయ్యింది. మరి, ఎందుకు టెలికాస్ట్ చేయడం లేదంటే? ఆ ఎపిసోడ్‌తో షోకి ఎండింగ్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ - మహేష్ ఎపిసోడ్ 'ఎవరు మీలో కోటీశ్వరుడు'కు క్లైమాక్స్ కానుంది.


రామ్ చరణ్ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథుల్లో సమంత ఒకరు. ఆమె ఎపిసోడ్ ఆడియన్స్ ను అట్ట్రాక్ చేసింది. దీపావళి కానుకగా ప్రసారమైన ఎపిసోడ్‌లో సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్ సందడి చేశారు. ఈ సీజన్ ఎపిసోడ్స్ అన్నీ షూటింగ్ చేసేశారని తెలిసింది. త్వరలో మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. దీని తర్వాత నెక్స్ట్ సీజన్ ఎన్టీఆర్ చేస్తారా? లేదా? అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చిన విరామంలో ఈ షో చేశారు. త్వరలో 'ఆర్ఆర్ఆర్' ప్రచార కాయ్రాక్రమాలు ప్రారంభం అవుతాయి. అందులో పాల్గొనాలి. అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయాలి. వాటికి టైమ్ కేటాయిస్తూ... షో చేయాలంటే విశ్రాంతి ఉండదు. అందువల్ల, ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.


Also Read: హీరో రాజ‌శేఖ‌ర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు


ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళితే... ఎక్కువ గ్యాప్స్ తీసుకోకుండా చకచకా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!


Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు


Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?


Also Read: ‘మనీ హైస్ట్’ తెలుగు ట్రైలర్.. ప్రొఫెసర్ తన ముఠాను రక్షిస్తాడా? మరింత థ్రిల్‌గా దోపిడీ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి