గోధుమల నుంచి గోధుమపిండి తయారుచేస్తారు, శెనగపప్పు నుంచి శెనగ పిండి తయారుచేస్తారు... మరి మైదా పిండి ఎలా చేస్తారు? ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండరు. మైదా తయారీ గురించి తెలుసుకుని ఉంటే కచ్చితంగా దాన్ని వాడడం ఆపేస్తారు మీరు. మైదాకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని అంతగా కాపాడుకున్నట్టు.
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
మైదాపిండి వినియోగం మనదేశంలో ఎక్కువే. రవ్వదోశ, కేకులు, పరోటా, జిలేబీలు, వివిధ రకాల స్వీట్లు, కొన్ని రకాల బ్రెడ్‌లు... ఇలా ఎన్నో ఆహారపదార్థాలు మైదాతోనే చేస్తారు. మనం తినే ఆహారంలో సగం మైదాతోనే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతగా ఆ పిండి మన ఆహారమెనూలో భాగమైపోయింది. కానీ మైదాతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ముందు దాని తయారీ గురించి తెలుసుకోమంటున్నారు.
Also read: రియాల్టీషోలో గెలుచుకునే ప్రైజ్‌మనీ మొత్తం విజేతకు దక్కుతుందా? లేక అందులో కూడా కటింగ్స్ ఉంటాయా?
మైదా తయారీ ఇలా...
మైదా తయారీకి ముడి పదార్థం గోధుమలు. గోధుమ పిండి మంచిదే అయినప్పుడు మైదా ఎందుకు మంచిది కాదు అనే సందేహం రావచ్చు. ఏదైనా ఒక ఆహారపదార్థం విలువ అది తయారుచేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. గోధుమలను కేవలం పిండి ఆడించడం ద్వారా మాత్రమే గోధుమపిండి తయారవుతుంది. కానీ మైదా అలా కాదు.... దీనికి పెద్ద తతంగమే ఉంది. గోధుమలను అతిగా పాలిష్ చేస్తారు. పై పొరలన్నీ పాలిష్ రూపంలో పోయిన తరువాత లోపల మిగిలిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి పసుపు రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా, చాలా మృదువుగా చేసేందుకు కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. క్లోరైడ్ గ్యాస్, బైంజాయిల్ పెరాక్సైడ్, అజోడి కార్బోనమైడ్ వంటి రసాయనాలను కలిపి పిండిని తెల్లగా మారుస్తారు. అదే మైదా. అన్నట్టు చివరలో పొటాషియం బ్రోమేట్ను కూడా అదనంగా జోడిస్తారు. ఇది చాలా శక్తివంతమైన ఆక్సిడైజర్.
క్యాన్సర్ కారకాలు...
మైదాపిండిలో వాడే ప్రధాన రసాయనమైన బెంజాయిల్ పెరాక్సైడ్ వాడాకాన్ని చాలా దేశాల్లో నిషేధించారు. దాని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనల్లో తేలింది. అలాగే పొటాషియం బ్రోమేట్న్ ను నిషేధించారు. మైదాలో ‘అల్లోక్సాన్’ అని పిలిచే విషపూరితమైన రసాయనం ఉంటుంది.
Also read: నిద్ర సరిపోకపోతే డయాబెటిస్ వచ్చే ఛాన్స్..
ఈ రోగాలు తప్పవు
మైదాపిండిని నిత్యం వాడేవారికి ఆరోగ్యసమస్యలు తప్పవని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకు మైదాతో చేసిన ఆహారాన్ని పెట్టకండి. పెడితే ఆమెకు చిన్నవయసులోనే రుతుక్రమం మొదలయ్యే ప్రమాదం ఉంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి