ఛానెల్స్ లో ఇప్పుడు రియాల్టీషోలదే హవా. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్, ఇండియన్ ఐడల్, సరిగమప ఇలా... చాలా ప్రైజ్ మనీ గెలుచుకునే ఆటలు రన్ అవుతున్నాయి. వీటిలో  గెలిచే విజేతకు ప్రైజ్ మనీ మొత్తం దక్కుతుందా లేదా? అందులో ఎలాంటి కత్తిరింపులు ఉంటాయి అనేది చాలా మంది సందేహం. మన ట్యాక్స్ చట్టాల ప్రకారం ఆ ప్రైజ్ మనీ మొత్తం విజేతకు దక్కదు. 


లాటరీ, ఆన్ లైన్ గేమ్స్, టీవీషోలు, గుర్రప్పందాలు... ఇలాంటి వాటి ద్వారా గెలుచుకున్న డబ్బు, ఆదాయపు పన్ను చట్టం  ప్రకారం సెక్షన్ 56(20)(Ib) కిందకు వస్తుంది. దీని ప్రకారం రియాల్టీషోలలో గెలుచుకునే డబ్బును ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం (Income from other sources)’గా పరిగణిస్తారు. దీని ప్రకారం విజేత దక్కించుకున్న మొత్తానికి 30 శాతం ఆదాయపు పన్ను కట్టాలి. అలాగే ఆదాయపు పన్ను  మీద ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ కూడా కట్టాలి. అంటే గేమ్ షోలో గెలిచిన మొత్తంలో 31.20 శాతం ట్యాక్స్ కింద చెల్లించాలి. 


గెలిచిన మొత్తం పదిలక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉంటే కొంత శాతం సర్‌ఛార్జ్ కూడా చెల్లించాలి. విజేతకు ప్రైజ్ మనీ చెల్లించే సంస్థ లేదా వ్యక్తి ఈ టీడీఎస్ ని ముందే కట్ చేసుకున్న తరువాతే విజేతకు మిగతా మొత్తాన్ని అందజేస్తారు.  మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గెలిచిన మొత్తం పదివేల రూపాయల కంటే తక్కువ ఉంటే టీడీఎస్ వర్తించదు. కానీ ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం ఆ పదివేల రూపాయలను ‘Income from other sources " లో చూపించాలి. కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయలు గెలుచుకున్న టీచర్ హిమానీ బుందేలా ట్యాక్స్ లన్నీ కట్ అయ్యాక 65 లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్లింది. 


ఇలా చేస్తే కట్టక్కర్లేదు...


అలాకాకుండా విజేత తాను గెలుచుకున్న మొత్తాన్ని ఏదైనా సంస్థకు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వస్తే మాత్రం ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 


Also read: నిద్ర సరిపోకపోతే డయాబెటిస్ వచ్చే ఛాన్స్..


Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట


Also read: సాయిపల్లవి జీరో సైజ్ ఫిగర్ వెనుక రహస్యాలివే...


Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి


Also read: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి