ఈ కాలంలో ఒత్తిడి చాలా సాధారణపదమైపోయింది. కానీ దాని ప్రభావం మాత్రం మానసిక ఆరోగ్యంపై తీవ్రంగానే పడుతోంది. ఉరుకుల పరుగుల జీవితం, బరువు బాధ్యతలు, ఆఫీసు పనుల ఒత్తిళ్లు, డెడ్ లైన్లు, ఆర్థిక సమస్యలు... అన్నీ కలిపి మనిషిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అయితే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా ఒత్తిడిని జయించవచ్చని చెబుతున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆహారం కూడా ఒత్తిడిని జయించేందుకు సహకరిస్తుంది.
1. పండ్లు
ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కొవాన్ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం తాజా పండ్లు, కూరగాయలు తినడం ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తేలింది. ఇందుకు 8,600 మందిపై ప్రయోగం చేశారు. తాజా పండ్లు, కూరగాయలు తినే వారితో పోలిస్తే, తినని వారిలో ఒత్తిడి పదిశాతం అధికంగా కలుగుతోంది. అందుకే ఆహారం పండ్లు, కూరగాయల శాతాన్ని పెంచమని సూచిస్తున్నారు.
2. చేపలు
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభించేది చేపల్లోనే. ఒత్తిడిని జయించే సమర్థతను అందించే సత్తా కూడా ఈ ఆమ్లాలకే ఉంది. కాబట్టి ఈ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్, ట్రౌట్, మాకెరెల్ వంటి చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. ఈ ఫ్యాలీ ఆమ్లాల వల్ల డిప్రెషన్ ను కూడా దూరంగా ఉంచొచ్చని కొన్ని పరిశోధనలు తేల్చాయి.
3. విటమిన్ బి12
విటమిన్ బి12 అధికంగా లభించే ఆహారపదార్థాల వల్ల కూడా ఒత్తిడిని జయించవచ్చు. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. చిరాకు, బద్దకం, డిప్రెషన్ వంటి లక్షణాలను మందగించేలా చేస్తాయి. పాలు, పెరుగు, చేపలు, గుడ్లు, చికెన్, చిరుధాన్యాలు వంటి వాటిల్లో విటమిన్ బి12 లభిస్తుంది.
4. విటమిన్ సి
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సిలో ఒత్తిడిని తగ్గించే సత్తా కూడా ఉంది. అందుకు న్యూట్రిషనిస్టులు కచ్చితంగా విటమిన్ సి ఆహారంలో ఉండేట్టు చూసుకోమని చెబుతారు. నారింజ, కివి, నిమ్మ, క్యాప్సికం, జామ కాయల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
5. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు
కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరుగుతామని చాలా మంది తినడం తగ్గిస్తారు. కానీ మానసిక ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. మెదడు పనితీరుపై ప్రభావం చూపే సెరోటోనిన్ ఉత్పత్తికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. సెరోటోనిన్ వల్ల సంతోషం కలుగుతుంది. దీని వల్ల ఒత్తిడి దూరమవుతుంది. సోయాబీన్స్, తాజా కూరగయాలు, అన్నం, బఠాణీలలో కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందా? నిజమేనా?
Also read: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి