కాజల్ నామినేషన్స్ లో సేఫ్ ఆడుతుందని.. ఆమె రీజన్ కి షాకయ్యానని విశ్వ హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఆ తరువాత యానీ మాస్టర్, శ్రీరామ్.. సన్నీ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నారు. అలానే కాజల్ మాట్లాడేదేం అర్ధం కావడం లేదని యానీ మాస్టర్ చెప్పింది. 

 

ఆ తరువాత మానస్-పింకీ విషయం కూడా నామినేషన్ లో మాట్లాడదాం అనుకున్నా.. 'నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఒకడిని,సేవలు చేయడానికి ఒకడిని పెట్టుకున్నావ్' అని చెబుదాం అనుకున్నాను.. కానీ నాకెందుకులే అని ఊరుకున్నా అంటూ రవి.. షణ్ముఖ్-సిరిలకు చెప్పాడు. 

 


 

'జీవితమే ఒక ఆట':

నామినేషన్లో ఉన్న సభ్యులు మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ. అంటే కేవలం కెప్టెన్ షణ్ముక్ మినహా మిగిలిన పదిమందీ నామినేషన్లో ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు 'జీవితమే ఒక ఆట' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో మూడు జోన్స్ ఉంటాయి. 

 

బ్యాగేజ్ జోన్ - నామినేట్ అయిన ప్రతి ఒక్కరి ముఖంతో ఒక బ్యాగ్ ఉంది 

సేఫ్ జోన్ - ఇమ్మ్యూనిటీ కొరకు పోటీ పడుతున్న సభ్యులు ఉంటారు. 

డేంజర్ జోన్ - ఇమ్మ్యూనిటిని కోల్పోయి డేంజర్ లో ఉన్న సభ్యులు ఉంటారు. 

 

సమయానుసారం బజర్ మోగినప్పుడు.. హౌస్ మేట్స్ బ్యాగేజ్ జోన్ కి పరుగెత్తుకెళ్లి.. ఎవరైనా ఇతర సభ్యుల ముఖంతో ఉన్న బ్యాగ్ ను తీసుకొని సేఫ్ జోన్ లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాగ్స్ తీసుకున్నాక చివరిగా ఎవరైతే సేఫ్ జోన్ డోర్ లోకి వెళ్తారో.. వారు మరియు వారి దగ్గరున్న బ్యాగ్ పై ఫొటో ఉన్న వారు కూడా డేంజర్ జోన్లోకి వెళతారు. అప్పుడు సేఫ్ జోన్లో ఉన్న నామినేటెడ్ సభ్యులు ఎవరిని సేఫ్ జోన్లోకి తీసుకురావాలో నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో అన్ని రౌండ్స్ పూర్తయ్యాక కేవలం ఒకరికి మాత్రమే ఇమ్మ్యూనిటీ లభిస్తుంది. 

 

కాజల్ బ్యాగ్ పట్టుకున్న శ్రీరామ్ కావాలనే సేఫ్ జోన్లోకి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు. ఇదేంటని అడిగిన సన్నీ-మానస్ కి ఇది నా స్ట్రాటజీ అని సమాధానం చెప్పాడు. ప్రియ, శ్వేత, హమీద...కాజల్ వల్లే వెళ్లిపోయారని శ్రీరామ్ చెప్పడంతో.. మరి విమెన్ కార్డ్ ఎలా వాడతావని కాజల్ ని యానీ మాస్టర్ ప్రశ్నించింది. ఫైనల్ గా శ్రీరామ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

 

సెకండ్ రౌండ్ లో జెస్సీ.. సన్నీ బ్యాగ్ తో లాస్ట్ లో రావడంతో ఇద్దరూ నామినేషన్ లో ఉండగా.. వీరిద్దరిలో హౌస్ మేట్స్ ఎక్కువ మంది జెస్సీని సేవ్ చేశారు. 

 

ఆ తరువాత బ్యాగేజ్ రూమ్ లోకి వెళ్లిన షణ్ముక్ బ్యాగ్స్ కి ముడులు వేశాడు. ఇది తప్పైతే పిలవండి అని బిగ్ బాస్ కి చెప్పాడు. ఈ లోగా బజర్ మోగడంతో స్టోర్ రూమ్ కి వెళ్లిన ఇంటి సభ్యులు బ్యాగుల కోసం పోటాపోటీగా లాక్కున్నారు. అసలు ముడులు ఎవరేయమన్నారని షణ్ముక్ పై... ప్రియాంక సింగ్ మండిపడింది. తన  ఆలోచన సరైనది కాకుంటే స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ కాదన్నాడు షణ్ముక్.   

 

చివరిగా సిరి వెళ్లడంతో.. ఆమె నామినేషన్ లోకి వచ్చింది. ఆమె చేతిలో జెస్సీ బ్యాగ్ ఉండడంతో అతడు కూడా డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఎక్కువ ఓట్లు సిరికి రావడంతో ఆమె సేవ్ అయింది. 

 

ఆ తరువాత శ్రీరామచంద్ర-విశ్వ నామినేషన్ లోకి రాగా.. శ్రీరామచంద్ర సేవ్ అయ్యాడు. 

 

రవి-సిరిలు నామినేషన్ లోకి రాగా.. రవికి ఎక్కువ ఓట్లు రావడంతో అతడు సేవ్ అయ్యాడు. 

 

సన్నీ ఫన్.. 

గేమ్ ఆడుతున్న ప్రియాంక, మానస్, శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, రవిలను ఉద్దేశిస్తూ.. 'చాలా చక్కటి పోటీ కనిపిస్తోంది అక్కడ.. మీకు అనిపిస్తుందా వాళ్ల హార్డ్ వర్క్ కి దానికి ఎవరు విజేతలుగా నిలుస్తారో' అని విశ్వను ప్రశ్నించాడు. దానికి విశ్వ 'ఇక్కడ హార్డ్ వర్క్ కాదు.. ఎవరు బ్యాగ్ పట్టుకొస్తారో..' అని చెప్తుండగా.. 'ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు' అంటూ అంతెత్తున లేచాడు.

 ఆ తరువాత గేమ్ ఆడుతున్న వారి దగ్గరకు వెళ్లాడు సన్నీ. ముందుగా పింకీతో మాట్లాడుతూ.. 'హాయ్ పింకీ గారు.. ఎలా ఫీల్ అవుతున్నారు..?' అని అడగ్గా.. 'మర్యాదగా పక్కకు మింగేయ్' అనగా.. హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. ఆ తరువాత మానస్ దగ్గరకు వెళ్లి తాగుబోతులా మాట్లాడుతూ.. 'ఫస్ట్ నువ్వు ఇమ్యూనిటీ ఎవరికి ఇవ్వాలంటే.. వాడికి అవసరం లేదు.. నాకు ఇమ్యూనిటీ అవసరం లేదా..?' అంటూ ఫన్నీగా అడిగాడు.. ఆ తరువాత 'నువ్ లైన్లో ఉండు' అంటూ శ్రీరామ్ దగ్గరకు వెళ్లాడు.

'మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్..' అనగా.. 'బయటకొచ్చాక మాట్లాడుకుందాం' అన్నాడు శ్రీరామ్. ఆ తరువాత 'మీరు చాలా కష్టపడ్డారు.. మీ ధైర్యాన్ని మెచ్చామని అన్నారు.. ఆ తరువాత జెస్సీని తీసి సిరికి ఎందుకు ఇచ్చారు..? రవి, సిరి ఉంటే సిరిని తీసి రవికి ఇచ్చారేంటి..?' అంటూ ఇమ్యూనిటీ గురించి శ్రీరామ్ ను ప్రశ్నించారు. 'ఇంక నెక్స్ట్ వచ్చేది న భూతో న భవిష్యత్.. ఐయామ్ వెరీ ఎగ్జైటెడ్ యార్' అంటూ కామెంట్ చేశాడు.  

 

ప్రియాంక ఫైర్.. 

ఆ తరువాత షణ్ముఖ్ ముడులు వేయడంతో ప్రియాంక బ్యాగ్ తీసుకురాలేకపోయింది. దీంతో ఆమెను నేరుగా గేమ్ నుంచి డిస్ క్వాలిఫై చేశాడు షణ్ముఖ్. ఈ విషయంలో ప్రియాంక కోప్పడింది. బిగ్ బాస్ చెప్పనివి కూడా చేసేస్తున్నారు అంటూ షణ్ముఖ్ పై మండిపడింది. 

 

నెక్స్ట్ గేమ్ లో మానస్ లేట్ గా రావడంతో అతడితో పాటు రవి కూడా నామినేషన్ లోకి వచ్చాడు. ఇందులో మానస్ సేఫ్ అయ్యాడు. 

 

ఆ తరువాత మానస్, యానీ మాస్టర్ నామినేషన్ లోకి రాగా.. యానీ మాస్టర్ సేఫ్ అయ్యారు. 

 

ఫైనల్ గా యానీ మాస్టర్-శ్రీరామచంద్రలలో హౌస్ మేట్స్ అందరూ కలిసి యానీ మాస్టర్ కి ఎక్కువ ఓట్లు వేయడంతో ఆమెకి ఇమ్మ్యూనిటీ లభించింది. 

 

మానస్ ని సేవ్ చేసిన యానీ.. 

ఇమ్మ్యూనిటీ పొంది సేవ్ అయిన యానీకి బిగ్ బాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఆ తరువాత హోస్ట్ ద్వారా లభించిన పవర్ ను తీసుకురమ్మని యానీకి చెప్పారు. యానీ తన పవర్ ను ఉపయోగించి నామినేట్ అయిన మిగతా ఇంటి సభ్యుల నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చని చెప్పారు. ఆ పవర్ ని మానస్ కోసం ఉపయోగించి అతడిని సేవ్ చేసింది యానీ. 

 

ఫైనల్ గా ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన కంటెస్టెంట్స్.. శ్రీరామ్, సన్నీ, విశ్వ, సిరి, కాజల్, జెస్సీ, రవి, ప్రియాంక. 

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి