ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి షణ్ముఖ్ తప్పించి మిగిలిన పది మంది కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేట్ అయ్యారు. అలా నామినేట్ అయిన ఇంటి సభ్యులకు సేవ్ అయ్యే ఒక ఛాన్స్ ను ఇచ్చారు బిగ్ బాస్. దీనికోసం 'జీవితమే ఒక ఆట' అనే టాస్క్ ఏర్పాటు చేశారు. 'ఏ సభ్యులైతే చివరిగా సేఫ్ జోన్ డోర్ లోకి వెళ్తారో వారు.. వారి దగ్గర ఏ సభ్యుల బ్యాగ్ ఉందో ఇద్దరూ డేంజర్ జోన్ లోకి వెళ్తారు. అప్పుడు సేఫ్ జోన్ లో ఉన్న నామినేటెడ్ సభ్యులు ఎవరిని సేఫ్ జోన్ లోకి తీసుకురావాలనుకుంటున్నారో నిర్ణయించాల్సి ఉంటుంది' అని తెలిపారు. 

 


 

ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ఒక ప్రోమో విడుదల కాగా.. అందుకే ఇంటి సభ్యుల మీద సీరియస్ డిస్కషన్స్ జరిగినట్లు కనిపించింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సన్నీ తన కామెంటరీతో ఫుల్ ఫన్ చేశాడు. గేమ్ ఆడుతున్న ప్రియాంక, మానస్, శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, రవిలను ఉద్దేశిస్తూ.. 'చాలా చక్కటి పోటీ కనిపిస్తోంది అక్కడ.. మీకు అనిపిస్తుందా వాళ్ల హార్డ్ వర్క్ కి దానికి ఎవరు విజేతలుగా నిలుస్తారో' అని విశ్వను ప్రశ్నించాడు. దానికి విశ్వ 'ఇక్కడ హార్డ్ వర్క్ కాదు.. ఎవరు బ్యాగ్ పట్టుకొస్తారో..' అని చెప్తుండగా.. 'ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు' అంటూ అంతెత్తున లేచాడు. 

 

ఆ తరువాత గేమ్ ఆడుతున్న వారి దగ్గరకు వెళ్లాడు సన్నీ. ముందుగా పింకీతో మాట్లాడుతూ.. 'హాయ్ పింకీ గారు.. ఎలా ఫీల్ అవుతున్నారు..?' అని అడగ్గా.. 'మర్యాదగా పక్కకు మింగేయ్' అనగా.. హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. ఆ తరువాత మానస్ దగ్గరకు వెళ్లి తాగుబోతులా మాట్లాడుతూ.. 'ఫస్ట్ నువ్వు ఇమ్యూనిటీ ఎవరికి ఇవ్వాలంటే.. వాడికి అవసరం లేదు.. నాకు ఇమ్యూనిటీ అవసరం లేదా..?' అంటూ ఫన్నీగా అడిగాడు.. ఆ తరువాత 'నువ్ లైన్లో ఉండు' అంటూ శ్రీరామ్ దగ్గరకు వెళ్లాడు. 

 

'మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్..' అనగా.. 'బయటకొచ్చాక మాట్లాడుకుందాం' అన్నాడు శ్రీరామ్. ఆ తరువాత 'మీరు చాలా కష్టపడ్డారు.. మీ ధైర్యాన్ని మెచ్చామని అన్నారు.. ఆ తరువాత జెస్సీని తీసి సిరికి ఎందుకు ఇచ్చారు..? రవి, సిరి ఉంటే సిరిని తీసి రవికి ఇచ్చారేంటి..?' అంటూ ఇమ్యూనిటీ గురించి శ్రీరామ్ ను ప్రశ్నించారు. ఆ తరువాత యానీ మాస్టర్ ను పిలిచిన బిగ్ బాస్ హోస్ట్ ద్వారా లభించిన పవర్ ను తీసుకురమ్మని చెప్పారు. యానీ తన పవర్ ను ఉపయోగించి నామినేట్ అయిన ఒకరిని సేవ్ చేయొచ్చని చెప్పారు. ఆ తరువాత సన్నీ.. 'ఇంక నెక్స్ట్ వచ్చేది న భూతో న భవిష్యత్.. ఐయామ్ వెరీ ఎగ్జైటెడ్ యార్' అంటూ కామెంట్ చేశాడు.