ప్రపంచాన్ని రెండేళ్లుగా తన గుప్పిట్లో బంధించి ఊపిరాడకుండా చేస్తోంది కరోనా. జనజీవనాన్ని స్తంభించేలా చేసిన మహమ్మారి అంతానికి ఏడాదిన్నరగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పరిశోధనల ఫలితంగా ఎన్నో టీకాలు తయారయ్యాయి. ఆ టీకాల ద్వారా కరోనా నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు. ప్రాణాంతక పరిస్థితి వరకు వెళ్లకుండా అడ్డుకుంటుంది టీకా. టీకాలతోనే సరిపెట్టాలనుకోలేదు శాస్త్రవేత్తలు దాని అంతానికే పూనుకున్నారు. అలాంటి పరిశోధన ఫలితంగా తొలిసారి ఒక టాబ్లెట్ (మాత్ర)ను కరోనా అంతానికి తయారుచేశారు. కరోనాకు వ్యతిరేకంగా తయారుచేసిన తొలి మాత్ర ఇది. ఈ మాత్రకు బ్రిటన్ ఔషధాల నియంత్రణ సంస్థ ఆమోదించింది. అంటే ఇక ఆ దేశంలో ఆ టాబ్లెట్లను ప్రజలు వినియోగిస్తారు. 


సమస్యను సగానికి తగ్గిస్తుంది
టాబ్లెట్ కు మోల్నుపిరవిర్ అని నామకరణం చేసింది బ్రిటన్. కరోనాతో బాధపడుతున్న వారికి ఈ మాత్రను రోజుకు రెండుసార్లు ఇస్తారు. ఈ టాబ్లెట్ వల్ల కరోనా వచ్చిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాల్సిన లేదా మరణించే ప్రమాదం సగానికి తగ్గిపోయినట్టు గుర్తించారు అధ్యయనకర్తలు. అమెరికా సంస్థ మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరపిస్ట్ సంస్థలు సంయుక్తంగా ఈ మాత్రను తయారుచేశాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది ఈ టాబ్లెట్. నిజానికి మెర్స్, సార్స్ వంటి ఇన్ ఫ్లూయెంజా వైరస్ లను చంపేందుకు దీన్ని తయారుచేశారు. అయితే ఇది కరోనా వైరస్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుండడంతో ఆ వైపుగా పరిశోధనలు చేశారు. కరోనా వైరస్ నాశనం చేయగల సామర్థ్యం దీనికుందని పరిశోధకుల నమ్మకం. ప్రస్తుతం కరోనా చికిత్సకు వినియోగిస్తున్న రెమ్ డెసివిర్ లాగే ఇది పనిచేస్తుంది. కాకపోతే దానికన్నా కాస్త ఎక్కువ సమర్థంగా, వైరస్ ముదిరాక కూడా దాన్ని అంతం చేయగలుగుతుంది. 


బ్రిటన్ దూకుడు
ఈ టాబ్లెట్ తయారుచేసింది అమెరికా సంస్థలైనా వాటిని మొదట వాడేది మాత్రం బ్రిటన్ ప్రజలు. ఆ టాబ్లెట్ వినియోగంపై ఇంకా అమెరికాలో సమీక్షలు జరుగుతున్నాయి. ఈలోపే ఈ మాత్రల వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. అమెరికాలో మాత్రం త్వరలో ఈ మాత్ర వాడాలా వద్దా అన్న విషయంలో ఓటింగ్ జరగనుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: రియాల్టీషోలో గెలుచుకునే ప్రైజ్‌మనీ మొత్తం విజేతకు దక్కుతుందా? లేక అందులో కూడా కటింగ్స్ ఉంటాయా?


Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట


Also read: సాయిపల్లవి జీరో సైజ్ ఫిగర్ వెనుక రహస్యాలివే...


Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి