ఇప్పుడు తెలుగులో ఇద్దరు హీరోలు టైగర్ నాగేశ్వరరావు జీవితకథ మీద మనసు పడ్డారు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరు అసలైన టైగర్? ఎవరు ప్రేక్షకుల ముందుకు ముందుగా వస్తారు? అంటే చెప్పడం కష్టమే. ఇద్దరు హీరోల్లో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఓ హీరోకి అండగా తండ్రి ఉంటే... మరో హీరోకి అనుభవం ఉంది. వాళ్లిద్దరే... రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.


దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' టైటిల్‌తో ఓ బయోపిక్ ప్రకటించారు. తెలుగు గడ్డ మీద 1970, 80లలో పేరు మోసిన గజదొంగ స్టూవ‌ర్ట్‌పురానికి చెందిన నాగేశ్వరారావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే... స్టూవ‌ర్ట్‌పురం నాగేశ్వరరావు కథతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ' బయోపిక్ ప్రకటన ఎప్పుడో వచ్చింది. అయితే... ఆ సినిమా ఆగిందని, రవితేజ దగ్గరకు అదే కథ రావడంతో సినిమా ప్రకటించారని కొందరు భావించారు. మేటర్ ఏంటంటే... తెర వెనుక జరిగిన అసలు కథ వేరు.


రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ప్రకటన వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో రెండు సినిమాలు ఉన్నాయని... ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదని స్పష్టమైంది. రవితేజతో సినిమా తీస్తున్న దర్శకుడు వంశీ టైగర్ బయోపిక్ మీద మూడేళ్లుగా స్క్రిప్ట్  వర్క్ చేస్తున్నారు. ముందు అతడు బెల్లంకొండ దగ్గరకు వెళ్లాడట. ఏమైందో ఏమో... అక్కడి నుండి వెనక్కి వచ్చేశాడట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన తండ్రి సురేష్‌కు టైగర్ బయోపిక్ మీద గురి కుదిరినట్టుంది. వేరే దర్శకుడితో సినిమా అనౌన్స్ చేశారు. ముందునుంచి కథ మీద వర్క్ చేస్తున్న వంశీ రవితేజ దగ్గరకు వచ్చాడు.


Also Read: ప్ర‌భాస్ రీసెంట్ కెరీర్‌లో ఇదొక రికార్డ్‌... అంత త‌క్కువ రోజుల్లోనా!?


ఒకే కథతో రెండు సినిమాలు తీస్తే కంపేరిజన్స్ రావడం ఖాయం. ఇంకొకటి... ఫస్ట్ రిలీజయ్యే సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ రిలీజయ్యే సినిమా ముందు రిలీజైన సినిమా కంటే భిన్నంగా ఉండాలి. లేదంటే... ఆల్రెడీ తీసిన సినిమాను మళ్లీ తీశారనే కామెంట్స్ ఎదుర్కోవాలి. ముందు రిలీజైన సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు తమ సినిమాలో ఉంటే మళ్లీ కొత్తగా రాసుకోవాలి. సో... ఎవరు ముందు సినిమా తీసి రిలీజ్ చేస్తారనేది కూడా ఇంపార్టెంటే. సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకముందే రెండు స్క్రిప్ట్స్ పట్టుకుని రచయితల సంఘం, దర్శకుల సంఘం తలుపులు తట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!


Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు


Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి