‘మనీ హైస్ట్’ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే ఈ వెబ్ సీరిస్ చివరి దశకు వచ్చేసింది. డిసెంబరు 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న వాల్యూమ్ 2, పార్ట్ 5 ఎపిసోడ్స్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ‘నెట్ ఫ్లిక్స్’ ఓటీటీ సంస్థ రిలీజ్ చేసింది. దీపావళి సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. మొదటి పార్ట్ కంటే రక్తికట్టించే విధంగా రెండో పార్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రసారమైన పార్ట్ 2లో సైన్యం రంగంలోకి దిగడంతో ప్రొఫెసర్ టీమ్‌ కష్టాల్లో పడింది. తమ టీమ్ సభ్యులను కాపాడేందుకు టోక్యో ఆత్మహుతికి పాల్పడి సైనికులను చంపేసింది. మరోవైపు ప్రొఫెసర్ కూడా పోలీస్ ఆఫీసర్ చేతికి చిక్కాడు. అయితే, ఆమె ప్రసవంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రొఫెసర్‌కు సాయం చేస్తుందా? లేదా అతడిని పట్టుకుని మళ్లీ తన సత్తా చాటుతుందా అనేది చూడాలి. 


తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ప్రోఫెసర్ తన డెన్‌ను వీడి బ్యాంక్ వద్దకు వస్తున్నట్లు చూపించారు. రెడ్ కలర్ కారులో బ్యాంక్ వద్దకు చేరుకున్న ప్రొఫెసర్‌కు సైన్యం లోపలికి వెళ్లేందుకు దారి ఇవ్వడాన్ని ట్రైలర్‌లో చూడవచ్చు. అయితే, ప్రొఫెసర్ అక్కడికి చేరుకోడానికి ముందు పోలీస్ ఆఫీసర్‌తో పోరాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఛేజింగ్ సీన్లను ట్రైలర్‌లో చూపించారు. మరో వైపు ఓ మహిళ సైనికురాలు బ్యాంకులో ప్రొఫెసర్ టీమ్‌తో పోరాడుతున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి.  


“మేము ఒక మిషన్‌ను పూర్తి చేయడానికి ఇక్కడకు వచ్చాం. ఈ దోపిడీకి ముగింపు పలకండి” అని సైన్యం వార్నింగ్ ఇస్తారు. పలెర్మో (రోడ్రిగో డి లా సెర్నా)  స్పందిస్తూ ‘‘మనం ఇక్కడి నుంచి బయట పడగలమా అని సందేహంగా ఉంది’’ అని అంటాడు. హెల్సింకి (డార్కో పెరిక్) “నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటకు పంపిస్తావు. నువ్వు నాకు వాగ్దానం చేసావు’’ అని అంటాడు. బ్యాంక్‌లోకి ఎంట్రీ తర్వాత ప్రొఫెసర్ ఏం చేస్తాడు? సైన్యానికి లొంగిపోతారా? లేదా మరో కొత్త ప్లాన్‌తో తప్పించుకుంటారా? అయితే, ప్రొఫెసర్‌ ఎత్తులు వేయడంలో దిట్ట.. ఈ సీజన్‌లో ఏ ప్లాన్ లేకుండా పోలీసులకు లొంగిపోతే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. మరి, ఈ సీరిస్ ఇంతటితో ముగుస్తుందా.. కొనసాగుతుందా అనేది తెలుసుకోవాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.


‘మనీ హైస్ట్’ తెలుగు ట్రైలర్:  



Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు


Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు


Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి