హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుడు సంభవించింది. నగరంలోని ఛత్రినాక సమీపంలోని కందికల్ గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేసే ఓ చిన్న పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. అందులో బాణాసంచా పేలుడు సంభవించి అగ్ని ప్రమాదానికి దారి తీసినట్లుగా తొలుత భావించారు. చనిపోయిన వారిని పశ్చిమ బంగాల్‌కు చెందిన విష్ణు అనే 25 ఏళ్ల వ్యక్తి, జగన్నాథ్ అనే 30 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాణా సంచాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు కలవడం వల్ల పేలుడు తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు చెప్పారు. క్లూస్ టీమ్స్‌తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అయితే, ఈ పేలుడులో కొత్త కోణం బయటపడింది. యువకులు గుంతలో టపాసులతోపాటు కెమికల్స్‌ను పెట్టి కాల్చడం వల్ల పేలుడు తీవ్రంగా సంభవించిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 


పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని ఏసీపీ మజీద్‌ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే యువకులు టపాసులతో కెమికల్స్ కలిపి పేల్చారా? లేక సరదాగా ఈ పని చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






Also Read: యువకులకు గాయాలు, 108కు ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అరగంట వెయిటింగ్.. చివరికి..


సరోజినీ దేవి ఆస్పత్రికి రోగుల క్యూ
మరోవైపు, కంటి సమస్యల వల్ల బాధితులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖానకు క్యూ కట్టారు. దీపావళి వేడుకల్లో బాణా సంచా కాల్చడం వల్ల ఒక్క రోజుల్లో సుమారు 27 కేసులు నమోదయ్యాయని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇందులో స్వల్పంగా గాయాలైన 22 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హాస్పిటల్‌లో చేర్పించుకున్నామని చెప్పారు. వారిలో ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.


Also Read: నిలకడగా పసిడి.. స్వల్పంగా పెరిగిన వెండి.. మీ నగరంలో నేటి ధరలు ఇలా..


Also Read: గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఇంధన ధరలు.. తాజా రేట్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి