ప్రజాప్రస్థాన యాత్ర చేపడుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో కొనసాగుతోంది. అయితే. చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో తన క్యాంపు సమీపంలోనే గురువారం ఉన్నట్టుండి ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ విషయం వైఎస్ షర్మిలకు తెలియడంతో వెంటనే ఆమె స్పందించి స్వయంగా 108 వాహనానికి ఫోన్ చేశారు.


అయితే, సమయానికి 108 అంబులెన్స్ ఘటన స్థలానికి రాకపోవడంతో షర్మిల తన కాన్వాయ్‌లోనే ఎక్కించుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సాయపడ్డారు. 108 అంబులెన్స్‌ ఆలస్యంగా రావడంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ 108 సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే 108 వాహన సేవలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా మర్రిగూడ సమీపంలోకి పాదయాత్ర చేరుకుంది. అక్కడే బస చేసేందుకు ఆమెకు క్యాంప్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ క్యాంప్‌ సమీపంలోనే ఈ బైక్ ప్రమాదం జరిగింది. 


Also Read: నాగశౌర్య తండ్రి ఫాంహౌస్‌లో పేకాట కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. అసలు సుమన్ ఎవరంటే..


17వ రోజుకు పాదయాత్ర
ఈ పాదయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ షర్మిల విమర్శలను గుప్పిస్తున్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం దృఫ్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో 17వ రోజుకు చేరుకుంది. నేడు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగనుంది. ఉదయం 9:30 గంటలకు చింతపల్లి మండలం కిష్టరాయన్‌ పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 10:30 గంటలకు మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల ప్రసంగిస్తారు.


Also Read: టీఆర్ఎస్ నేతలకు అప్పుడు మాత్రమే జోష్ వస్తుంది.. సీఎం కేసీఆర్‌కు RRR సినిమా మొదలైందా..!


Also Read: రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలపై ప్రభావం


Also Read: గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఇంధన ధరలు.. తాజా రేట్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి