దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ అధికారులు ప్రకటించారు.  శుక్రవారం ఉదయం ఢిల్లీ యూనివర్సిటీ, పీయూఎస్‌ఏ, లోధి రోడ్, మధుర రోడ్, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  అనేక ప్రాంతాల్లో  గాలి నాణ్యత 396, 376, 379, 398, 395, 387గా నమోదైంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 50 వరకు నమోదైతే గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉన్నట్లుగా గుర్తిస్తారు.  అదే 51-100 మధ్య ఉంటే పర్వాలేదు.. 101-200 మధ్య ఉంటే ఓ మోస్తరుగా ఉన్నట్టు.. 201-300 మధ్య గాలి నాణ్యత నమోదైతే చాలా పేలవంగా ఉన్నట్లుగా తేలుస్తారు. 301-400 మధ్య ఉంటే మరి అధ్వాన్నంగా ఉందని ఇక చివరిగా 401-500 మధ్య ప్రమాదకర స్థాయిలో ఉందని గుర్తిస్తారు.  ప్రస్తుతం 400 పాయింట్ల సమీపంలో ఢిల్లీలో గాలి నాణ్యత ఉంది.


Also Read : కేదార్‌నాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ


దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్లతో వాయుకాలుష్యం భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. బాణాసంచాపై నిషేదం విధించినా ప్రజలు పట్టించుకోలేదు. అయితే ఒక్క దీపావళి బాణసంచా కాల్చడం వల్లనే సమస్య రాలేదు. ఎందుకంటే దీపావళికి ముందు నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది.గత నాలుగు , ఐదు రోజుల నుంచి ఈ పొల్యూషన్ పెరుగుతూ వస్తోంది. దీపావళి ముందు రోజే ఢిల్లీ లో వివిధ ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ రెండు వందల వరకూ చేరుకుంది.


Also Read : SI ఒంటిపై సగం యూనిఫాం.. భయంతో పరుగో పరుగు, తరిమిన అధికారులు.. చివరికి..


ప్రతి ఏడాది దీపావళి తర్వాత ఢిల్లీలో ఈ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం టపాసులు మాత్రమే కాదు. టపాసులు ఒక్క ఢిల్లీలోనే దేశం మొత్తం కాలుస్తారు.. అయితే ఢిల్లీలోనే పొల్యూషన్ కనిపించడానికి ప్రధాన కారణం పంటలు తగలబెట్టే సీజన్ ప్రారంభం కావడమే. పంటల కాలం ముగియడంతో హర్యానా, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో పంటలను దహనం చేస్తూ ఉంటారు. ఆ పొగ అంతా గాలుల కారణంగా ఢిల్లీకే చేరుకుంటూ ఉంటుంది. దీంతో ఢిల్లీ లో వాయు నాణ్యత పడిపోతుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. 


Also Read: Petrol Rates : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి