పేదవాడి యాపిల్ గా చాలా దేశాల్లో జామకాయను పిలుచుకుంటారు. ఇది ధరలో తక్కువ, అందించే పోషకాలలో ఎక్కువ ఉంటుంది. అంతేకాదు ప్రతి పండుకి ఓ సీజన్ ఉంటుంది. కానీ జామ మాత్రం అన్ని సీజన్లలోనూ కాస్తుంది. రోజుకో జామకాయ తిన్నా చాలు శరీరం బోలెడన్నీ అద్భుత ప్రయోజనాలను సొంతం చేసుకుంటుంది.
1. విటమిన్ సి నారింజ పండులో అధికంగా ఉంటుందని అనుకుంటారంతా. అది నిజమే కావచ్చు, కానీ నారింజ కన్నా జామలో అయిదు రెట్లు అధికంగా విటమిన్ సి లభిస్తుంది.
2. చర్మసౌందర్యానికి, ఆరోగ్యానికి ‘కొల్లాజిన్’ ఉత్పత్తి చాలా అవసరం. దీని ఉత్పత్తికి అవసరమయ్యే ‘పెక్టిన్’ అనే ఎంజైమ్ జామలో లభిస్తుంది. ఇది పేగుల్లోని ప్రోటీన్ ను కూడా కాపాడుతుంది.
3. జామకాయలు ఎన్నితిన్నా పెద్దగా కేలరీలో శరీరంలోకి చేరవు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కూడా వీటిని హ్యాపీగా తినవచ్చు.
4. మధుమేహంతో బాధపడేవారు కూడా జామకాయను ఆరగించవచ్చు. ఈ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి, సి విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఏ కూడా అధికంగా లభిస్తుంది.
5. గర్భిణులు జామకాయను తింటే మేలు జరుగుతుంది. ఇందులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. శిశువుకు నాడీ సంబంధిత వ్యాధులు, లోపాలు రాకుండా జామ కాయలోని ఈ పోషకాలు కాపాడతాయి.
6. జామపండులో లైకోపీన్, క్వెర్సటిన్, పాలిపెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
7. జామకాయలో 80 శాతం నీరే ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. దంతసమస్యలు రాకుండా నివారిస్తుంది.
8. జామపడు రోజూ తినేవారిలో సంతాన సమస్యలు కూడా ఏర్పడవు. సంతానోత్పత్తిని ప్రోత్సహించే పండు జామ.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: ఎక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆపడం కష్టంగా ఉందా... ఇలా చేయండి
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి