బిగ్ బాస్ 5లో ‘హీరోస్ vs విలన్స్’ టాస్క్‌లో ఇంటి సభ్యుల మధ్య డిష్యూం డిష్యూం ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ టాస్క్‌లో బిగ్ బాస్.. సభ్యుల మధ్య మరోసారి పుల్ల పెట్టాడు. రెండు టీమ్స్‌లో ఒకరితో ఒకరు మారే (స్వాపింగ్) అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. ఇది షణ్ముఖ్ - సన్నీల మధ్య వార్‌కు దారి తీసింది. చివరికి
ఎవరూ మారేందుకు అంగీకరించలేదు. నిన్న ప్రసారమైన ఎపిసోడ్‌లో హీరోస్ టీమ్‌కు అవకాశం వచ్చింది. దీంతో విలన్ టీమ్‌లో ఉన్న ఆనీ మాస్టర్‌కు చుక్కలు చూపించారు. టాస్క్‌లో భాగంగా ఆనీ మాస్టర్ వివిధ సాస్‌లు మిక్స్ చేసిన ద్రవాలు, గుడ్లు, పాలు మిక్స్ చేసిన జ్యూస్‌లు తాగింది. మిర్చి తినడమే కాకుండా.. పెయింట్‌ను ఒళ్లంతా పూసుకుంది. పేడ నీళ్లు, ఐస్ వాటర్ తలపై పోసుకుంది. క్విట్ కాకుండా చివరి వరకు నిలిచింది.
షన్ను కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సిరికి దూరంగా ఉంటున్నాడు. సిరి సపోర్ట్ చేస్తూ జస్వంత్ పలుసార్లు షన్ముఖ్‌ను నిలదీశాడు. ఈ రోజు (శుక్రవారం) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కూడా సిరి-షణ్ముక్ మధ్య వాదన కొనసాగనుంది. షణ్ముక్ ది ఫేక్ ఫ్రెండ్ షిప్ అని సిరి కన్నీళ్లు పెట్టుకోవడం, షణ్ముక్ బతిమలాడినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
ఈ రోజు విడుదల చేసిన ప్రోమోలో.. బిగ్ బాస్ సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు. రెండు పోల్స్ ఇచ్చి ఒకరినొకరు తోసుకోమని చెప్పాడు. చివరి వరకు దానిపై ఎవరు నిలబడతారో వారే విజేత అని తెలిపాడు. దీంతో అక్కడ ఏం జరుగుతుంతో మీరే ఊహించుకోవచ్చు. టాస్కుల విషయాల్లో చాలా వయొలెంట్‌గా ఉంటున్న ఇంటి సభ్యులు తాళాల కోసం తోసుకోవడాన్ని ఈ ఎపిసోడ్‌లో చూడవచ్చు. చూస్తుంటే.. బిగ్ బాస్ వీరెంటి ఇంత దారుణంగా ఆడుతున్నారు.. చూస్తుంటేనే భయమేస్తోందని ప్రేక్షకులు అనుకొనేలా ఇంటి సభ్యులు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రోమోను చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది.
‘బిగ్ బాస్ 5’ ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో:
Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు
Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు
Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
ఇట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి