పనిలేనప్పుడు ఎక్కిళ్లు వచ్చినా పెద్దగా పట్టించుకోం కానీ, ఆఫీసులోనే, మీటింగులోనో వస్తే మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే కొందరిలో తరచూ వస్తుంటాయి, మొదలయ్యాక ఒకంతట పోవు. చాలా మంది ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తికి ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పి భయపెట్టడం ద్వారా ఎక్కిళ్లను ఆపొచ్చని చెబుతుంటారు. కానీ షాకింగ్ న్యూస్ లు ఎక్కిళ్లు ఆపడం సంగతి పక్కనపెడితే, కొత్త సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి? ఆపేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దాం.
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?
పొట్ట పైభాగాన ఉండే కండరాన్ని డయాఫ్రమ్ అంటారు. ఇది మీ పొట్టని, ఛాతీని విడదీసే కండరం. శ్వాసతీసుకోవడంలో దీనిదే ముఖ్యపాత్ర. ఆహారం తింటున్నప్పుడు శ్వాసక్రియని నియంత్రించడం, శరీరం ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం దీని పని. అయితే మెదడు నుంచి ఫ్రెనిక్ అనే నాడి డయాఫ్రమ్ వరకు ఉంటుంది. డయాఫ్రమ్, ఫ్రెనిక్ నాడి కొన్ని సార్లు సరిగా కలిసి పనిచేయకపోతే గాలి పీల్చుకునే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుపోతుంది. తిరిగి స్వరపేటిక తెరుచుకుని సాధారణంగా పనిచేసేవరకు మనకు ఎక్కిళ్లు వస్తాయి.
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
ఎక్కిళ్లు తగ్గాలంటే ఇలా చేయండి
1. ఎక్కిళ్లు తగ్గాలంటే కాసేపు ఊపిరిబిగపట్టండి. కాసేపటి తరువాత గాలిని వదిలేసి, సాధారణంగా శ్వాస తీసుకోండి. కొందరిలో ఈ చిట్కా పనిచేస్తుంది. అందరికీ కచ్చితంగా పనిచేయాలని లేదు.
2. గ్లాసు నీళ్లను గ్యాప్ లేకుండా గడగడ తాగేయండి.
3. ఒకస్పూను పంచదారను చప్పరించకుండా మింగేయండి.
4. గుక్కెడు నీళ్లు నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయండి.
5. నిమ్మపండుని ఓసారి కొరకండి లేదా కాస్త వెనిగర్ ను టేస్టు చేయండి.
6. ఒక పేపర్ బ్యాగ్ తీసుకుని నోరు, ముక్కు దగ్గర పెట్టుకుని అందులోకి గాలి వదులుతూ, శ్వాస తీసుకుంటూ ఉండాలి.
వీటిలో ఏదో ఒక చిట్కా మీ ఎక్కిళ్లను ఆపుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రియాల్టీషోలో గెలుచుకునే ప్రైజ్‌మనీ మొత్తం విజేతకు దక్కుతుందా? లేక అందులో కూడా కటింగ్స్ ఉంటాయా?
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి