ఏడాది పొడవునా ఎన్నో పండుగలు వస్తుంటాయి. కానీ నెలరోజులూ పండుగలా జరుపుకునేది కార్తీకమాసంలోనే. సూర్యోదయానికి ముందే స్నానాలు, పూజలు, వ్రతాలు, దానాలు , ఉపవాసాలు, వనభోజనాలు అబ్బో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. అయితే కార్తీక మాసంలో భగవంతుడిని పూజించేందుకు భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు, ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్లిందల్లా నియమం, మనపై మనకు నియంత్రణ అంతే. అలాంటి నియమంలో ఒకటి ఉపవాసం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని `కార్తీకపురాణం` చెబుతోంది. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు ఆరోగ్యపరంగానూ మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో, అలాగే మన జీర్ణవ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. వారానికి ఓరోజు ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారం అవుతాం. పైగా నిత్యం తీసుకునే ఆహారం జీర్ణించుకునేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. తిన్న వెంటనే మగతగా అనిపించడానికి కారణం కూడా ఇదే. అలా కాకుండా ఒక రోజంతా శరీరాన్ని తన మానాన వదిలేస్తే రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరం మూలమూలన ఉన్న దోషాలను ఎదుర్కొని అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది.
శరీరానికి తనకు తానుగా స్వస్థత పరచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే దానని ఎదుర్కొనే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. ఒంట్లో కాస్త నలతగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదిస్తాం, భారీగా టెస్టులు, ఆహారంలా మందులు మింగేస్తాం. కానీ మన పెద్దల్లో ఈ భయం ఉండేది కాదు. అజీర్ణం చేసినా, జ్వరం వచ్చినా, ఉపవాసం ఉండి శరీరానికి తగిన అవకాశాన్ని ఇచ్చేవారు. అందుకే ఆయుర్వేదంలో `లంకణం పరమౌషధం` అని చెప్పారు.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
ఉపవాసం మానసిక ఔషధం కూడా:
ఉపవాసం శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా ఎంతో మంచి చేస్తుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్నీ, మనసుని ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఔషధం! విపరీతమైన కారం తింటే ఒకరకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరోరకమైన ఆలోచనలుంటాయి. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తల్చుకునేందుకు, అన్ని మతాలవారూ ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు భగవన్నామస్మరణ తప్ప మరో ఆలోచన రాదు. అందుకే కార్తీకమాసం మొత్తం నిత్యం ఒకపూట తినేవారు కొందరు, ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరు, ఏకాదశి-ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు . ఏదీ కుదరకపోతే కనీసం ఒక్క సోమవారమైనా ఉపవాసం ఉండాలని చెబుతారు.
Also Read: సోదరులకు భోజనం పెట్టి కానుకలిచ్చే వేడుక, కార్తీకమాసంలో రెండో రోజు 'భగినీ హస్త భోజనం'
కార్తీకమాసంలోనే ఉపవాసం ఎందుకు ఉండాలి:
ఉపవాసాల కోసం కార్తీకమాసాన్నే ఎందుకు ఎంచుకుంటారంటే బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది. చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా శక్తి అవసరం అవుతుంది. కానీ ఈ నెలలో ఉష్ణోగ్రతలు , చలి రెండూ ఎక్కువగా ఉండవు. ఇలాంటి సమయంలోనే శరీరాన్ని అదుపుచేయాలని చెబుతారు పెద్దలు.
ఆకలి వేసిన వెంటనే శరీరం కోరుకునేది ఆహారం. వెంటనే ఆహారం తీసుకోకుండా కొద్దిసేపు ఓపిక పడితే అది చాలా మార్పు తీసుకొస్తుందంటారు. "మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు, మీ ఆహారాన్ని మరొకరికి ఇవ్వగలిగితే, మీరు మరింత బలశాలురవుతా"రని చెప్పాడు గౌతమబుద్ధుడు.
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం… భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Karthika Masam Special: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
ABP Desam
Updated at:
07 Nov 2021 06:00 PM (IST)
Edited By: RamaLakshmibai
ఉపవాసం అనే మాట వినగానే వీళ్లకి చాలా భక్తి ఎక్కువే అంటారంతా. కానీ వాస్తవానికి ఉపవాసం దేవుడి కోసం కాదు మన కోసం, మన జీర్ణవ్యవస్థ శుద్ధి కోసం అన్నది తెలుసా.
ఉపవాసం
NEXT
PREV
Published at:
07 Nov 2021 07:06 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -