సోదరీ, సోదరుల ఆప్యాయత, అనుబంధానలకు అద్ధంపట్టే సంప్రదాయ పండుగ 'భగినీ హస్త భోజనం'. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుకే భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే కార్తీకమాసంలో రెండో రోజు ఇది జరుపుకుంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే రాఖీ తో సమానమైన పండుగన్నమాట.  అయితే రక్షాబంధనం రోజు అన్నదమ్ములు తమ సోదరి రక్ష( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు చూస్తామని, ఎల్లవేళలా రక్షిస్తామని చెపుతారు. అంటే రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. భగినీ హస్త భోజనం సోదరుల క్షేమానికి  సంబంధించినది. 
"భయ్యా ధూజీ'' అనే పేరుతో ఉత్తరభారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వేడుక ఇది. 
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
పురాణ కథనం
యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని ఇంటికి  రమ్మని ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.  ఒకసారి కార్తీక మాసం విదియ రోజున అనుకోకుండా చెల్లెలు యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని ఎంతో సంతోషించిన యమున పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ ఆనందంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అయితే తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన ఈ రోజున ఎవరైతే అక్కచెల్లెళ్ల ఇంట్లో భోజనం చేస్తారో వాళ్లకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. సంతోషించిన యముడు..కార్తీకమాసంలో విదియ రోజు సోదరి చేతి భోజనం చేసిన సోదరుడికి  అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుందని... ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట. 
Also Read:  కేదార్ నాథ్ లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహం ప్రత్యేకతలివే...


సూర్యుని పిల్లలైన యుమడు, యమునకు ఒకరంటే మరొకరికి ఎంతో ఆప్యాతయ. తన సోదరి అనుగ్రహానికి పాత్రులైన వారికి అపమృత్యు దోషం ఉండదని కూడా యముడు వరమిచ్చాడట. అందుకే యమునా నదిలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదని కూడా చెబుతారు. పురాణ కాలం నుంచి ఇప్పటి వరకూ కార్తీక శుద్ధ విదియ రోజు సోదరులను ఇంటికి ఆహ్వానించి తోచిన పిండివంటలు చేసి దగ్గరుండి వడ్డిస్తారు. అనంతరం హారతి ఇచ్చి సోదరులకు వస్త్రాలు, ఆభరణాలు లాంటి కానుకలు కూడా ఇస్తారు. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో జరుపుకునే పండుగ కాదా దక్షిణాదిన కూడా పలువురు జరుపుకుంటున్నారు.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి