ఆదివారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున ముందుగా హౌస్ మేట్స్ తో 'బొమ్మ ఇక్కడ పాట ఎక్కడ..' అనే గేమ్ ఆడించారు. ఇందులో హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడారు. సన్నీ, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, విశ్వలు ఒక టీమ్. యానీ, శ్రీరామ్, రవి, సిరి, మానస్ లు సెకండ్ టీమ్. గేమ్ లో భాగంగా ప్లాస్మా టీవీలో వచ్చే విజువల్స్ ను చూస్తూ పాటను గెస్ చేయాలి. ఈ గేమ్ లో రవి అండ్ కో విన్నర్స్ నిలిచారు.
శ్రీరామ్ సేఫ్..
నామినేషన్ లో మిగిలిన ఐదుగురి ముందు కుండలు పెట్టిన నాగార్జున.. అందులో రింగ్ ఉందని.. దానిపై బిగ్ బాస్ 'ఐ' ఉంటే సేఫ్ అని చెప్పారు. శ్రీరామ్ కి బిగ్ బాస్ ఐ రావడంతో అతడు సేవ్ అయ్యాడు.
నేను ఎవరిని..?
హౌస్ మేట్స్ తో 'నేను ఎవరిని' అనే గేమ్ ఆడించారు. ఫిష్ బౌల్ లో ఉన్న హౌస్ మేట్స్ పేరుని కెమెరా ముందు చూపించి ఆ తరువాత వాళ్లను ఇమిటేట్ చేస్తే.. మిగిలిన హౌస్ మేట్స్ గెస్ చేయాల్సివుంటుంది. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ తమ ఫన్నీ యాక్షన్స్ తో బాగా నవ్వించారు. ఇందులో సన్నీ అండ్ కో విన్నర్స్ గా నిలిచారు.
జెస్సీ సేఫ్..
నామినేషన్ లో మిగిలిన నలుగురి చేతుల్లో బ్యాడ్జ్ లు పెట్టారు. దానిపై హీరో ఉంటే సేఫ్.. విలన్ ఉంటే అన్ సేఫ్. ఇందులో జెస్సీ బ్యాడ్జ్ కి హీరో రావడంతో అతడు సేఫ్ అయ్యాడు.
వరస్ట్ పెర్ఫార్మర్..
ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని నాగార్జున హౌస్ మేట్స్ ని అడిగారు.
- సన్నీ- సంచాలక్ గా తన బాధ్యతలు ఇంకాస్త బాగా నిర్వర్తించాల్సిందని షణ్ముఖ్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- షణ్ముఖ్ - గేమ్ లో సిరిని పుష్ చేసిందని.. దానివలన ఆమె హర్ట్ అయిందని ప్రియాంకకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- ప్రియాంక - విశ్వ తనను తప్పుగా అర్ధం చేసుకుంటున్నాడని.. ఆయనకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది.
- విశ్వ - జెస్సీ గేమ్ కి ముందే గివప్ ఇచ్చేశాడని ఆయనకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- జెస్సీ - కాజల్ గేమ్ డల్ అయిందని ఆమెకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- కాజల్ - సిరికి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది.
- సిరి - కాజల్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది. గేమ్ లో డల్ అయిందని రీజన్ చెప్పింది.
- మానస్ - షణ్ముఖ్ చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ నచ్చలేదని అతనికి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- రవి - టాస్క్ మధ్యలో డల్ అయ్యాడని.. మానస్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- శ్రీరామ్ - కాజల్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
- యానీ మాస్టర్ - సన్నీకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది.
కాజల్ ను వరస్ట్ పెర్ఫార్మర్ గా ఫైనల్ చేశారు.
ప్రియాంక సేఫ్..
నామినేషన్ లో మిగిలిన విశ్వ, కాజల్, ప్రియాంక చేతుల్లో బాక్సులు పెట్టారు. ప్రియాంక బాక్సులో సేఫ్ అని ఉండడంతో ఆమె సేవ్ అయింది.
విశ్వ-కాజల్ లను గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున. వారిద్దరినీ ఒకేసారి బాక్సులు ఓపెన్ చేయమని చెప్పారు. అందులో ఉన్న బెలూన్స్ పైకి వెళ్తే వాళ్లు సేఫ్ అని.. వెళ్లని వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. కాజల్ బాక్స్ లో ఉన్న బెలూన్స్ పైకి వెళ్లడంతో ఆమె సేఫ్ అయింది. విశ్వ ఎలిమినేట్ అయ్యాడు.
ప్రియాంకకు పదవ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ కి తొమ్మిదో ర్యాంక్ ఇస్తూ.. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్ ప్రూవ్ చేస్కో అని చెప్పాడు. జెస్సీకి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చి.. గేమ్ లో గివప్ ఇవ్వొద్దని చెప్పాడు. యానీ మాస్టర్ కి ఏడో ర్యాంక్ ఇస్తూ.. నువ్ నీలా ఆడు.. యువర్ ఏ ఫైటర్ అని చెప్పాడు. మానస్ కి ఆరో ర్యాంక్ ఇస్తూ.. గెలిచినా.. ఓడినా ఒకేలా ఉండమని చెప్పాడు. సిరికి ఐదో ర్యాంక్ ఇచ్చి.. ఏదైనా ఉంటే మొహం మీదే చెప్తాదని.. ఫైనల్స్ వరకు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సన్నీకి నాల్గో ర్యాంక్ ఇస్తూ.. నువ్ నీలానే ఉండు అంటూ చెప్పుకొచ్చారు. షణ్ముఖ్ కి మూడో ర్యాంక్ ఇస్తూ.. గెలుపోటములు జీవితంలో ఒక భాగం.. గెలుపుని ఎలా తీసుకుంటావో.. ఓటమిని కూడా అలానే తీస్కో అని చెప్పాడు. రవికి సెకండ్ ర్యాంక్ ఇస్తూ.. అందరికోసం మంచిగా ఆలోచిస్తారని అన్నాడు. శ్రీరామ్ కి నెంబర్ వన్ ర్యాంక్ ఇస్తూ.. ఎమోషనల్ అయిపోయాడు విశ్వ. శ్రీరామ్ ని చూస్తే చనిపోయిన తన తమ్ముడు గుర్తొస్తాడని చెప్పాడు విశ్వ. శ్రీరామ్ చాలా జెన్యూన్ అని.. గేమ్ ఛేంజర్ అని అన్నాడు.