మంగళం శ్రీను... 'పుష్ప' సినిమాలో సునీల్ పాత్ర పేరు. ఆ పేరు విన్నప్పుడు 'కొంచెం కొత్తగా ఉంది కదూ' అనుకున్నారంతా! పేరు మాత్రమే కాదు... లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. రెగ్యుల‌ర్‌గా సినిమాల్లో సునీల్‌కు, మంగళం శ్రీనుకు వ్యత్యాసం చూపించారు. ఈ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కు ఇవ్వాలి. వేళ్లకు ఉంగరాలు... చేతికి వాచ్... మెడలో బంగారు గొలుసులు... కోరమీసకట్టు... కొంచెం వెనక్కి వెళ్లిన జుట్టు... అన్నిటి కంటే ముఖ్యంగా కళ్లల్లో ఎక్స్‌ప్రెష‌న్‌... మంగళం శ్రీను మామూలుగా లేడు. సినిమాలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.





అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా 'పుష్ప: ద రైజ్'. ఇందులో సునీల్ విలన్. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా విలన్ రోల్ చేస్తున్నారు. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నట్టు గతంలో ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా ఇది.


గతంలోనూ సునీల్ విలన్ రోల్ చేశారు. రవితేజ 'డిస్కో రాజా'లో హీరో స్నేహితుడిగా ఉంటూ, మంచిగా నటిస్తూ... పతాక సన్నివేశాలు వచ్చేసరికి క్రూరత్వం బయటపెట్టే పాత్ర చేశారు. 'కలర్ ఫొటో'లో చెల్లెలు ప్రేమకు అడ్డుగా నిలిచే అన్న పాత్రలో విలనిజం చూపించారు. ఆ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సునీల్ విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. 


Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!


Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..


Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం


Also Read: 'జై భీమ్' సినిమాలో 'సినతల్లి'గా నటించిన ఆమె గురించి మీకు ఈ విషయాలు తెలుసా..!


Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?


Also Read: తామర... సితార సంస్థ నిర్మిస్తున్న తొలి ఇండో-ఫ్రెంచ్ సినిమా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి