సుమ కనకాల... తెలుగు ప్రజలకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమ అంటే ఓ బ్రాండ్. యాంక‌ర్‌గా, హోస్ట్‌గా అంతలా పేరు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా కనిపిస్తారు. అయితే... అదీ ఎక్కువ శాతం యాంక‌ర్‌గా, హోస్ట్‌గా! అలా కాకుండా, ఇప్పుడు సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన ఆమె, త్వరలో వెండితెరపై సందడి చేయడానికి వస్తున్నారు.

Continues below advertisement


సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'జయమ్మ పంచాయతీ'. ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కలివరపు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు బలగ ప్రకాష్ రావు నిర్మాత. ఈ రోజు సినిమాలో సుమ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. 






ఓ కొండ మీద గుడి, యువ ప్రేమజంట, మావోయిస్టులు, పోలీస్ స్టేషన్, ఊరి జనాలు, చెట్టుకు వేలాడుతున్న నలుగురు మనుషులు... వీళ్లందరినీ చూపించిన తర్వాత మోషన్ పోస్టర్ లో సుమను చూపించారు. రోకలితో దంచికొడితే... రోలు పగిలిందంతే! ఊరి అంతటినీ ఆమె చీరకొంగు మీద చూపించడం... ఆ ఊరికి ఆమె శివగామి అన్నట్టు సింబాలిక్ గా చెప్పడమే! థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. 


Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!


Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?


Also Read: నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం, నాగశౌర్య 'లక్ష్య' సింగిల్ లిరికల్ వీడియో..


Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...


Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి