Skylab Trailer: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'స్కైల్యాబ్'. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. #SkyLabTrailer
Continues below advertisement
'సైల్యాబ్'లో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యా మీనన్
అమెరికన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం 'స్కైల్యాబ్' భూమ్మీద పడుతుందని... ప్రపంచం నాశమైపోతుందని 1979లో వార్తలొచ్చాయి. కరీంనగర్ జిల్లాలోని బండ లింగంపల్లి గ్రామంలోని ప్రజల జీవితాల్లో ఆ వార్తల వల్ల ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయనే కథాంశంతో రూపొందిన సినిమా 'స్కైల్యాబ్'. గౌరీ పాత్రలో నిత్యా మీనన్, ఆనంద్ పాత్రలో సత్యదేవ్, సుబేదార్ రామారావు పాత్రలో రాహుల్ రామకృష్ణ నటించారు. విశ్వక్ ఖండేరావు పాత్రలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. డిసెంబర్ 4న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు (శనివారం) ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే... విలేకరిగా పనిచేసే దొర బిడ్డగా నిత్యా మీనన్, కుమార్తెకు అన్నీ తన పోలికలే వచ్చాయని సంతోషించే తల్లిగా తులసి... బండ లింగంపల్లిలో క్లినిక్ ప్రారంభించే యువకుడిగా, పైసల పిచ్చోడిగా ప్రజల్లో ముద్రపడ్డ మనిషిగా సత్యదేవ్, సుబేదార్ పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించారు. 'స్కైల్యాబ్' వార్తల వల్ల ఈ ముగ్గురి జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేది సినిమా కథ. సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించారు.
'ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు. గుర్తు పెట్టుకోండి' అని నిత్యా మీనన్ సీరియస్ గా డైలాగ్ చెప్పడం... 'స్కైల్యాబ్' అంటే ఆకాశంలో ప్రయోగశాల అన్నట్టు' అని రాహుల్ రామకృష్ణ చెబితే, 'భూమీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు' అని పెద్దావిడ ఆశ్చర్యం వ్యక్తం చేయడం... 'ఏమైంది? ఏం కాలే! ఏం కాదు' అని సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ చెప్పడం... ట్రైలర్ అంతా వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు నిత్యా మీనన్ సహ నిర్మాత.
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
Continues below advertisement
Also Read: 'నేను ఆడితే మీకేంట్రా నొప్పి'.. షణ్ముఖ్ ఫైర్.. ఏడ్చేసిన సిరి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Continues below advertisement