బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ ఒకరినొకరు టార్చర్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో వచ్చింది. హౌస్ మేట్స్ అందరూ కొత్త బట్టలు వేసుకొని.. టపాసులు కాలుస్తూ కనిపించారు. ఆ తరువాత ప్రియాంక వెళ్లి మానస్ తో నవ్వుతూ మాట్లాడుతుండగా.. 'మచ్చా అక్కడేం జరుగుతుందని' సన్నీ.. కాజల్ ని అడిగాడు. దానికి ఆమె 'ప్రేమించుకుంటున్నారు' అని బదులిచ్చింది. ఆ వెంటనే ప్రియాంక.. మానస్ ని కౌగిలించుకోవడం దానికి సన్నీ వెటకారంగా తలూపడం ప్రోమోలో కనిపించింది.
Also Read:తాగినా.. తాగకపోయినా నేను స్టడీ.. బాలయ్య కామెంట్స్..
ఆ తరువాత సిరి-ప్రియాంక బెడ్ పై కూర్చొని మాట్లాడుకున్నారు. 'ఎంతవరకు వచ్చింది మీ ఇద్దరి లవ్' అంటూ ప్రియాంకను అడిగింది. దానికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఇక హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ బాల్స్ ని విసిరికొట్టుకునే టాస్క్ ఇచ్చినట్లు ఉన్నారు. రెండు టీమ్ లుగా విడిపోయి బాల్స్ తో ఒకరినొకరు కొట్టుకుంటూ కనిపించారు హౌస్ మేట్స్.
ఆ వెంటనే సిరి ఏడుస్తూ కనిపించింది. 'లోపల ఒకటి పెట్టుకుంటావ్.. బయటకి ఒకలా ఉంటావ్' అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. 'వాడు(జెస్సీ), నేను తెలియక చేసినదానికి ఎంత రచ్చ చేశావ్ షన్ను నువ్వు.. ఇప్పుడు దానికి డబుల్ బాధపడుతున్నా నేను' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ తరువాత షణ్ముఖ్ 'అరె ఇండివిడ్యుయల్ గేమ్ ఆడమంటారు.. మీరు ఆడతారు.. నేను ఆడితే మీకేంట్రా నొప్పి.. ఎవడి గేమ్ వాడు ఆడాడు' అంటూ జెస్సీతో చెప్పాడు.