Pamidi ASI Dies After His Mothers Death: అప్పటివరకూ ఆ కుటుంబంలో అంతా నవ్వులు.. సంబరాలు.. కానీ కొన్ని గంటల వ్యవధిలో సీన్ మొత్తం మారిపోయింది. పెళ్లి సంబరం జరిగిన ఇంట్లో నవ్వులకు బదులు విషాదం చోటుచేసుకుంది. మనవడి పెళ్లి జరిగిన కొన్ని గంటలకు నానమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తల్లి మరణవార్తను బంధువుల నుంచి తెలుసుకున్న వెంటనే ఏఎస్సై కుప్పకూలిపోయాడు. ఆ వివరాలిలా ఉన్నాయి..


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో ఈ విషాద ఘటన శనివారం జరిగింది. కుటుంబసభ్యులతో పాటు స్థానికులను సైతం ఈ విషాదం కంటతడి పెట్టింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి(56) జిల్లాలోని పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటస్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు ఇదివరకే పెళ్లిళ్లు చేశారు. శనివారం వీరి కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.
Also Read: ప్రేమ పేరుతో నయవంచన... నగ్న వీడియోలు తీసి బెదిరింపులు... అవమానంతో యువతి ఆత్మహత్య


అనుకున్న ముహూర్తానికే ఏఎస్సై వెంకటస్వామి తన కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించారు. ఓవైపు కుమారుడి వివాహం జరిపిస్తున్నా.. మరోవైపు తన తల్లి అనారోగ్యం గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల కిందట వెంకటస్వామి తల్లి కొన్నమ్మ అస్వస్థతకు గురికావడంతో అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వాయిదా వేయలేని పరిస్థితుల్లో శుభకార్యాన్ని జరిపించారు. 


Also Read: చనిపోయాడని సాయంత్రం అంత్యక్రియలు చేశారు.. రాత్రికి తిరిగి వచ్చాడు


మనవడు గోవర్ధన్ వివాహం జరిగిన కొంత సమయానికే కొన్నమ్మ నిపోయింది. ఈ విషయాన్ని వెంకటస్వామి బంధువులు ఆయనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కోలుకుని ఇంటికి తిరిగి వస్తుందనుకున్న తల్లి చనిపోయిందన్న వార్త విని షాక్ కు గురైన ఏఎస్సై వెంకటస్వామి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు, బంధువులు వెంకటస్వామిని ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ పెళ్లిసందడి కనిపించిన ఇంట్లో ఇద్దరి మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులను సైతం ఈ ఘటన కలచివేసింది.


Also Read: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..


Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి