ఇటీవల విడుదలైన 'వరుడు కావలెను', అంతకు ముందు 'భీష్మ', 'జెర్సీ', 'ప్రేమమ్' వంటి విజయవంతమైన సినిమాలను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు ఓ అంతర్జాతీయ (ఇండో - ఫ్రెంచ్) సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న సినిమా 'తామర'. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. అందులో తల పక్కకు తిప్పుకొన్న అమ్మాయిని చూస్తుంటే... మహిళలకు సంబంధించిన కథాంశంతో సినిమాను తీస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాకు రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాని కంటే ముందు 'భరత్ అనే నేను' చేశారు. హిందీలో 'దిల్ చాహతా హై', 'గజినీ', 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'కోయి మిల్ గయా' వంటి హిట్ సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్. తమిళంలో 'బాయ్స్'తో పాటు పలు మలయాళ చిత్రాలకు పని చేశారు.
దర్శకుడిగా రవి కె. చంద్రన్ మూడో సినిమా 'తామర'. తమిళంలో 'యాన్', మలయాళంలో 'భ్రమమ్' (హిందీ సినిమా 'అంధాధున్' రీమేక్) చేశారు. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్‌లో రూపొందుతోన్న 'తామర' కథ, కథనాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. ‘జెర్సీ' చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న సమయంలో సితార సంస్థ ఈ సినిమా ప్రకటించడం విశేషం.
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
Also Read: నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం, నాగశౌర్య 'లక్ష్య' సింగిల్ లిరికల్ వీడియో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి