దీపావళి మరుసటి రోజు హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆరోజున ఎన్నోయాదవ కుటుంబాలు తమ దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి, తీన్మార్ డ్యాన్సులతో ఇరగదీస్తారు. ఈసారి సదర్ ఉత్సవాల్లో ఓ బాహుబలి దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొర్రజాతికి చెందిన దున్నపోతును హర్యానా నుంచి చప్పల్ బజార్ కు చెందిన లడ్డూ యాదవ్ అనే వ్యక్తి తీసుకొచ్చారు. దీని యజమాని బల్వీర్ సింగ్. హర్యానాలో నివసిస్తారు. ఈ దున్నపోతును అద్దెకిస్తూ ఉంటారు. అలాగే అంతర్జాతీయ పోటీలకు తీసుకెళ్తుంటారు. ఇప్పటికే ఇది నాలుగుసార్లు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ ను సాధించింది. దీని ఖరీదు రూ.30 కోట్లు. ఈ దున్నపోతును ఒక్కరోజుకు అద్దెకు తీసుకుంటే కోటీ ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలి. సదర్ ఉత్పవాల్లో ఈ దున్నపోతును అలంకరిచేందుకు లడ్డూ యాదవ్ ఏకంగా మూడు కిలోల బంగారు గొలుసును చేయించారు. అందుకు ఏకంగా కోటిన్నర రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. ఆ బంగారు గొలుసును తాను తిరిగి తీసుకోనని దున్నకే వదిలేస్తానని చెబుతున్నాడాయన.
ఖర్చును తట్టుకోవడం కష్టమే...
ఈ దున్నపోతు మామూలుది కాదు. దీన్ని తిండికి చాలా ఖర్చవుతుంది. రెండు పూటలా రెండు డజన్ల యాపిళ్లు, కిలో డ్రైఫ్రూట్స్ తినేస్తుంది. పొద్దున్నే కాసేపు వాకింగ్ చేస్తుంది. రాత్రయితే ఓ ఫుల్ బాటిల్ మందు తాగుతుంది. ఆవనూనెతో మర్ధనా రోజూ ఉండాలి. ఈ దున్నపోతును చూసేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. దీని అసలు పేరు ‘లవ్ రానా’. దీని బరువు రెండు వేల కిలోల వరకు ఉంటుంది.
అప్పట్నించి మొదలు...
సదర్ ఉత్సవాలు హైదరాబాద్లో 1946 నుంచి అంగరంగ వైభవంగా జరపడం మొదలైంది. పండుగ కోసం దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా సదర్ ను జరుపుకోలేదు. అందుకే ఈసారి ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో ‘లవ్ రానా’ను హర్యానా నుంచి తెప్పించారు.
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి